బిగ్ ట్విస్ట్ - కాంగ్రెస్ సీఎం అభ్యర్దిగా చిరంజీవి..!!

ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఏపీలో వైసీపీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. గెలుపే ప్రామాణికంగా, సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ కొత్త వ్యూహం సిద్దం చేస్తోంది. ఇండియా కూటమి బంధాన్నే ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. చిరంజీవికి పార్టీ నుంచి కీలక ఆఫర్ ఇవ్వటానికి సిద్దమైంది.

Recommended Video

    AP రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టుల.. CM Candidate గా Megastar Chiranjeevi | Telugu Oneindia

    ఏపీలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు మేనిఫెస్టో..సీట్ల ఖరారు పైన ఫోకస్ చేసాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. కానీ, బీజేపీ నుంచి మాత్రం అధికారికంగా స్పష్టత రావటం లేదు. ఈ సమయంలోనే ఏపీలో తిరిగి పట్టు పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఏపీలో పార్టీ పగ్గాలు షర్మిలక ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే షర్మిలకు పార్టీ పగ్గాలు ఇవ్వటం పైన హర్షకుమార్ లాంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే మరో నేత చింతా మోహన్ కీలక ప్రతిపాదన చేసారు.

    Congress Leader Chinta Mohan says Chiranjeevi will be the CM Candidate for next Elections

    గతంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా పని చేసిన చిరంజీవి తిరిగి పోటీ చేయాలని చింతా మోహన్ కోరారు. చిరంజీవి తిరిగి తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించారు. చిరంజీవి కాంగ్రెస్ సీఎం అభ్యర్దిగా చిరంజీవి ఉంటారని చెప్పుకొచ్చారు. అటు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇటు చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సినిమాలకే పరిమితం అయ్యారు. తాను రాజకీయాల్లోకి మరోసారి వచ్చే అవకాశం లేదని గతంలోనే చిరంజీవి తేల్చి చెప్పారు. అయితే, కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయని విషయాన్ని చింతా మోహన్ లాంటి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గురించి చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

    చిరంజీవి సోదరులు ఇద్దరూ జనసేనలో ఉన్నారు. చిరంజీవి తన సోదరుడు కీలక పదవి చేపడతారని గతంలో ఆశాభావం వ్యక్తం చేసారు. తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని మాత్రం తేల్చి చెప్పారు. కానీ, ఇప్పుడు ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలతో మరోసారి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+