జలీల్ ఖాన్, దేవినేని ఉమతో టచ్ లోకి కాంగ్రెస్ ?

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో సీట్లు దక్కని వారంతా ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వైపు చూస్తుంటే.. ఆయా పార్టీల్లో సీట్లు లభించని వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇదే క్రమంలో విజయవాడకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు దేవినేని ఉమ, జలీల్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాస్త పేరుండీ ఈసారి అవకాశాలు రాని వారిని టార్గెట్ చేస్తున్న పీసీసీ ఛీఫ్ షర్మిల దూతలు ఇప్పుడు వీరితో మాట్లాడుతున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో టీడీపీ ప్రకటించిన మూడు జాబితాల్లోనూ మాజీ మంత్రి దేవినేని ఉమకు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో టీడీపీలో యాక్టివ్ నేతగా, మంత్రిగా కూడా పనిచేసిన తనకు ఈసారి అధిష్టానం వివిధ కారణాలతో మొండి చేయి చూపడంతో ఉమ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన కాంగ్రెస్ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన కోరిన సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధమని ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

congress party eyes on tdp ticket missing leaders devineni uma and jaleel khan

మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్ కు సైతం ఈసారి టీడీపీలో టికెట్ దక్కలేదు. దీనికి కారణం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తే. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేన నేత పోతిన మహేష్ కు ఇవ్వాలని ముందుగా భావించినా, ఇప్పుడు బీజేపీ నుంచి సుజనా చౌదరితో పాటు మరికొందరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ మాత్రం ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంకే టార్గెట్ గా మాజీ కార్పోరేటర్ ఆసిఫ్ కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆసిఫ్ కు ప్రత్యర్ధిగా మైనార్టీ అభ్యర్ధి లేకపోతే మాత్రం వారి ఓట్లన్నీ ఆయనకే పడటం ఖాయంగా ఉంది. దీంతో జలీల్ ఖాన్ తన మాజీ పార్టీ కాంగ్రెస్ లో చేరి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+