ఏపీ కేంద్రంగా ముప్పేటదాడికి భారీ స్కెచ్..!!

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ.. భారీ వ్యూహాలను రచించింది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని ముట్టడించడానికి, ముప్పేటదాడి చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లు, 2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై జాతీయ స్థాయి పోరాటానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది.

వీటన్నింటికీ- ఏపీ కేంద్ర బిందువు కాబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేయడానికి నిరసనగా ఫిబ్రవరి 2వ తేదీన అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతోంది. ఈ సభకు ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు.

Congress top leaders set to visit Andhra Pradesh on February 2

జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు చేయడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోన్న మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదే కావడం, ఏపీలో దీన్ని నిర్వహించబోతోండటం చర్చనీయాంశమైంది. శింగనమల నియోజకవర్గం పరిధిలోని బండ్లపల్లిలో ఈ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించుకుంది. దీనికోసం ఇదివరకే మల్లికార్జున్ ఖర్గేని కలిశారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ఏపీలో బహిరంగ సభ నిర్వహించాలని ఆహ్వానించారు.

దీనికి తాజాగా మల్లికార్జన్ ఖర్గే స్పందించారు. ఏపీలో ఈ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సూచించినట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం పేరు, చట్టంలో మార్పులు చేయడం పట్ల ఏపీలో తలెత్తిన పరిస్థితులను ఆయనకు వివరించారు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండటం, ఈ 19 నెలల కాలంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం వంటి పరిణామాలను వారు ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకు వివరించారు. దీంతో ఈ సభకు హాజరు కావడానికి ఆయన అంగీకరించారు.

ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ బిల్లును ప్రవేశపెట్టడం పట్ల కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. మొన్నటి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో నిరసనలు సైతం చేపట్టింది. మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటల్లో నుంచి చెరిపివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. సంవత్సరంలో 100 రోజుల పాటు గ్రామీణులకు ఖచ్చితంగా ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును స్క్రాప్ చేయాలనుకోవడం అవివేకమని మండిపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+