ఆన్ లైన్ షాపింగ్ తో కరోనా ప్రమాదం .. అదెలాగంటే
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక దీంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 15వేలు దాటిపోయింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ప్రపంచ సంక్షోభం'గా ఈ వైరస్ వ్యాప్తిని ప్రకటించింది. మొదట్లో ఈ వైరస్‌కు గురైనవారు ఎక్కువగా చైనాలో మరణించారు. ముఖ్యంగా వూహాన్ లో ఈ వైరస్ మరణ మృదంగం మోగించింది . ఇక ఏది చేసినా కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది.

ఆన్ లైన్ షాపింగ్ తో కరోనా ప్రమాదం
ఇక ఇప్పుడు ఇండియాను పట్టి పీడిస్తుంది కరోనా.ఇక ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఇక దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి . ఇక దీంతో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇది కూడా అత్యంత ప్రమాదం అన్న భావన వ్యక్తం అవుతుంది . ఎందుకంటె చాలా వరకు భారత్ లో కొనుగోలు చేసే వస్తువులు చాల వరకు చైనా నుండి దిగుమతి చేసినవి . అయితే వుహాన్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వస్తువులను ముట్టుకోవడం వల్ల వైరస్ వ్యాపించినట్టు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు కనిపించలేదు కానీ అలాంటి అవకాశం లేకపోలేదు అన్న భావన వ్యక్తం అవుతుంది.

వివిధ వస్తువులపై కరోనా వైరస్ ఉంటె కొరియర్ ద్వారా సోకే అవకాశం
కరోనా వైరస్ కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్ , రాగి మరియు స్టెయిన్‌లెస్ స్టీల్‌పై చాలా సమయం పాటు ఉంటుంది . దీంతో మీ ఇంటికి వచ్చే కొరియర్ మీ ఇంటికి కొరోనా వైరస్‌ను తీసుకుని రాగలదని అంటున్నారు పరిశోధకులు. ఇంకా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అని, ఆన్ లైన్ షాపింగ్ చేస్తే కరోనాకి ఆహ్వానం పలికినట్లే అని చాలా మంది అంటున్నారు .

ఆన్ లైన్ షాపింగ్ కొంతకాలం పాటు చెయ్యకుంటే మేలు
మూడు రోజుల పాటు అది 72 గంటల పాటు వివిధ మెటీరియల్స్ పై కరోనా వైరస్ ఉంటుంది. 72గంటల్లో సూపర్ క్విక్ కొరియర్ డెలివరీ ఇస్తే మీ ఇంటి లోపలికి ప్రవేశించడానికి కరోనా వైరస్‌కు కష్టమేం కాదు. పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం వివిధ పరిస్థితుల్లో ఏరోసోల్స్, ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, రాగి మరియు కార్డ్ బోర్డ్‌లలో కరోనా వైరస్ చురుకుగా ఉంటుంది.కాబట్టి కరోనా వైరస్ వ్యాపించడం పెద్ద కష్టమేమి కాదు కాబట్టి అందుకే కరోనాని ఆహ్వానించకుండా ఉండాలంటే ఆన్ లైన్ షాపింగ్ కొన్ని రోజులు ఆపుకోవటమే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆన్ లైన్ షాపింగ్ లో విదేశాల నుంచి వచ్చే వస్తువులే ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం అంటున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications