'మనిషి'వేనా అసలు.. ఐదేళ్ల కూతురుపై తండ్రి అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు !!
సాధారణంగా బయటవాళ్లు ఏమైనా అంటే 'మా నాన్నకు చెబుతా' అని అంటారు పిల్లలు. మరీ ముఖ్యంగా ఆడబిడ్డకి ఆపద వస్తే ముందు గుర్తుకు వచ్చేది తండ్రి. అలాంటిది ఆడపిల్లల్ని కంటిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే వారి పాలిట మృగాళ్లలా మారుతున్నారు. ఏం పోయే కాలం వస్తుందో.. లేదా ఏదైనా మయా రోగం వస్తుందో కానీ.. కామంతో కళ్లుమూసుకుపోయి.. వయస్సుతో సంబంధం లేకుండా కన్నవారి జీవితాలను చిదిమేస్తున్నారు.
ఐదేళ్ల కూతురి పట్ల మృగంలా ప్రవర్తించాడు ఓ తండ్రి. అత్యంత దారుణంగా చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేయగా.. ఈ ఘటనలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మద్యం మత్తులో..
ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి.. భార్య, ఇద్దరు పిల్లలతో విశాఖపట్నంలో జీవిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న భార్యతో గొడవపడి, పిల్లలిద్దరినీ తీసుకుని బయటకు వెళ్లాడు. రాత్రి మద్యం మత్తులో, పాత సినిమా హాల్ దగ్గర ఉన్న రేకుల షెడ్డులో చిన్నారులను ఉంచాడు. అయితే ఐదేళ్ల కూతురు ఏడుస్తుండటంతో.. చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే చిన్నారి ఏడుపు గట్టిగా వినపడడంతో.. సమీపంలో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే అక్కడికి పరుగెత్తారు. పరిస్థితిని గమనించి వెంటనే సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. కాగా వారు అక్కడికి చేరుకొని భీమిలి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి తీవ్ర రక్తస్రావంతో ఉండడం చూసి సమీపంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌కి తరలించారు.
కోర్టు సంచలన తీర్పు..
కాగా ఘటనపై "పోక్సో చట్టం" కింద కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజీలు, వైద్య నివేదికలు, సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు విశాఖ పోక్సో కోర్టు విచారణ పూర్తి చేసి.. నిందితుడిపై అత్యంత కఠినమైన తీర్పు వెలువరించింది. బాధితురాలి కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని.. నిందితుడు జీవితాంతం జైల్లోనే ఉండేలాని తీర్పు ప్రకటించింది.
ఇలాంటి అరుదైన తీర్పులు, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారులపై దాడి కేసుల్లో కఠిన శిక్షలు ఇప్పటికీ కలిగి ఉన్నా.. జీవితాంతం జైల్లో ఉండే తీర్పు చాలా అరుదు అని వివరించారు. చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్న ఈ సమయంలో.. తల్లిదండ్రులు, బంధువులు, పొరుగువారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications