Coronavirus: లేడీ డాక్టర్ పై ఉమ్మివేసిన పేషంట్లు, మాతో పాటు నువ్వు చస్తావ్, మంగళహారతి, ఎస్పీ !

అగర్తాలా (త్రిపుర)/ న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను నానా తిప్పలు పెట్టి వారి ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికలు వారి ప్రాణాలను పణంగా పడెడుతున్నారు. అయితే భారతదేశంలో నిత్యం ఏదోఒక ప్రాంతంలో వైద్యుల మీద కొందరు కరోనా పేషంట్లు దుర్మార్గంగా వ్యవహిరిస్తున్నారు. కరోనా రోగులను ఆసుపత్రిలో చేర్పించడానికి ప్రయత్నించిన ఓ లేడీ డాక్టర్ మీద కరోనా పేషంట్లు ఉమ్మివేసి అమానుషంగా ప్రవర్తించారు. మేము చెప్పినట్లు వినకుంటే నీకు కరోనా వ్యాధి అంటిస్తామని, మాతో పాటు నువ్వు చస్తావని ఆ మహిళా డాక్టర్ ను హెచ్చరించిన కరోనా పేషంట్లు నానా గంగామా చేసి ఇప్పుడు అడ్డంగా బుక్కైనారు. లేడీ డాక్టర్ పై ఉమ్మివేసిన కరోనా పేషంట్లకు త్వరలో మంగళహారతి ఇస్తామని జిల్లా ఎస్పీ అన్నారు.

 భగత్ సింగ్ యూత్ హాస్టల్

భగత్ సింగ్ యూత్ హాస్టల్

త్రిపురలోని వెస్ట్ త్రిపుర జిల్లాలో భగత్ సింగ్ యూత్ హాస్టల్ ఉంది. వెస్ట్ త్రిపుర జిల్లాలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ఆ వ్యాధి సోకిన రోగులకు చికిత్స చెయ్యడానికి భగత్ సింగ్ యూత్ హాస్టల్ ను COVID-19 కేర్ సెంటర్ గా మార్చారు. వెస్ట్ త్రిపుర జిల్లాలో కరోనా వైరస్ సోకిన రోగులకు ఈ భగత్ సింగ్ యూత్ హాస్టల్ లో చికిత్స అందిస్తున్నారు.

 లేడీ డాక్టర్ సంగీత

లేడీ డాక్టర్ సంగీత

వెస్ట్ త్రిపుర జిల్లా కోవిడ్ -19 పర్యవేక్షణ అధికారి డాక్టర్ సంగీత చక్కబొర్తి ఇటీవల ఐదు మంది మహిళా కరోనా పేషంట్లను భగత్ సింగ్ యూత్ హాస్టల్ లోని కోవిడ్ - 19 కేర్ సెంటర్ లో చేర్పించడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో అదే కోవిడ్ -19 కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు కొత్తగా వచ్చిన ఐదు మంది మహిళలను చేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పారు.

 ఇదేమైనా పందుల దొడ్డా ?

ఇదేమైనా పందుల దొడ్డా ?

ఇప్పటికే ఈ కోవిడ్ -19 కేర్ సెంటర్ లో ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారని, ఇలాంటి సమయంలో మీరు వేరే ప్రాంతాల నుంచి కరోనా వైరస్ సోకిన వారిని ఇక్కడకు తీసుకు వస్తే ఎలా ? అంటూ అక్కడ ఉన్న మహిళా రోగులు డాక్టర్ సంగీత చక్రబొర్తితో గొడవపడ్డారు. ఆ సమయంలో అక్కడ ఉన్న రోగులకు డాక్టర్ సంగీత సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.

 లేడీ డాక్టర్ మీద ఉమ్మివేసి వార్నింగ్

లేడీ డాక్టర్ మీద ఉమ్మివేసి వార్నింగ్

కోవిడ్ -19 కేర్ సెంటర్ లో మహిళలను చేర్పించడానికి ప్రయత్నించిన డాక్టర్ సంగీతపై దాడి చెయ్యడానికి ప్రయత్నించిన అక్కడి రోగులు నానా హంగామా చేశారు. అంతటితో శాంతించకుండా లేడీ డాక్టర్ అని కూడా చూడకుండా ఆమెపై కొందరు ఉమ్మివేసి నీకు కరోనా వైరస్ అంటిస్తాం, మాతో పాటు నువ్వు చచ్చిపోతావ్, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. మన ప్రాణాలు కాపాడటానికి వారి ప్రాణాలు అడ్డువేస్తున్నారని కనీసం జాలికూడా లేకుండా లేడీ డాక్టర్ సంగీతపై విచక్షణారహితంగా వ్యవహరించడంతో సాటి వైద్య సిబ్బంది షాక్ కు గురైనారు.

Recommended Video

    Aishwarya Rai Bachchan Tests Negative For COVID-19, Discharged From Hospital
    మంగళహారతి ఇస్తాం

    మంగళహారతి ఇస్తాం

    ఉద్దేశపూర్వకంగా లేడీ డాక్టర్ సంగీత చక్కబొర్తిపై ఉమ్మివేసి వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ త్రిపుర జిల్లా ఎస్పీ మానిక్ లాక్ దాస్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే సీసీటీవీ కెమెరాలలోని క్లిప్పింగ్స్ ఆధారంగా ఇద్దరు నిందితులను తాము గుర్తించామని, మిగిలిన నిందితులను గుర్తించి వారికి కరోనా వైరస్ వ్యాధి నయం అయిన తరువాత కచ్చితంగా మంగళహారతి ఇస్తామని జిల్లా ఎస్పీ మానిక్ లాక్ దాస్ మీడియాకు చెప్పారు. లేడీ డాక్టర్ సంగీత మీద ఉమ్మివేసి నానా రచ్చ చేసిన రోగులకు మేము చికిత్స అందించమని, వారు మా మీద దాడి చేసే అవకాశం ఉందని సాటి వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+