తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు - బిగ్ అలర్ట్..!!
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీ, తెలంగాణ లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో ఒకే రోజు మరో 11 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది. నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం ఆరుగురికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఏపీతో పాటుగా తెలంగాణలోనూ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 25 ఏళ్ల మహిళకు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఏ.తిమ్మాపురం గ్రామానికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, గోనెగండ్ల మండలం లింగందిన్నెకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, కర్నూలు నగరానికి చెందిన 20 ఏళ్ల యువతికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని కర్నూలు జీజీహెచ్‌లోని వీఐపీ నెగిటివ్ ప్రెజర్ రూంకు తరలించారు. కర్నూలు జీజీహెచ్‌లో కొవిడ్ పాజిటివ్‌ల సంఖ్య ఆరుకు చేరింది. బ్రెయిన్ ట్యూమర్‌తో కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగంలో చేరిన విజయనగరం జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలికకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

గడిచిన నాలుగు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక జ్వరం, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్యులు ర్యాపిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో సదరు బాలికను ఐసొలేషన్ వార్డుకు తరలించి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించారు. ఫలితం రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద వెల్లడించారు. దీంతో, రెండు తెలుగు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications