వైఎస్ వివేకా హత్యకు కుటుంబీకులదే నైతిక బాధ్యత..? సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. అయితే ఈ క్రమంలో సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏం కామెంట్ చేసినా సంచలనమే.. కానీ ఈ సారి వివేకా హత్య గురించి మాట్లాడారు. అదీ కూడా విచారణ ఎందుకు.. ఎవరో తెలిసిపోయిందని చెప్పారు. నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

వైఎస్ కుటుంబీకులే..

వైఎస్ కుటుంబీకులే..

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించిన ద‌ర్యాప్తులో సీబీఐ వేగం పెంచిన సంగతి తెలిసిందే. సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హ‌త్య‌పై ఇక విచార‌ణే అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. వివేకాను చంపిందెవ‌రో ఇప్ప‌టికే తేలిపోయింద‌ని అన్నారు. వివేకాను చంపిందెవ‌రో అంద‌రికీ తెలిసిపోయింద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ హ‌త్య‌కు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

సీబీఐపై కూడా ఎదురుదాడి అట

సీబీఐపై కూడా ఎదురుదాడి అట

వివేకా హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ గ‌త కొంత కాలం నుంచి ఇన్వెస్టిగేషన్ వేగాన్ని పెంచింది. వివేకా హ‌త్య‌కు సంబంధించి మీడియాలో భిన్న క‌థ‌నాలు వ‌స్తున్నాయి. శ‌నివారం సీపీఐ నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హ‌త్య కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐపై కూడా ఎదురు దాడి జ‌రుగుతోంద‌ని హాట్ కామెంట్స్ చేశారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే లా అండ్ ఆర్డ‌ర్ ఎక్క‌డికి పోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

డబ్బులు ఇవ్వలేదే..

డబ్బులు ఇవ్వలేదే..

తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని దస్తగిరి ఇంతకుముందే చెప్పాడు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు ప్రాణభయం ఉన్నట్టు తెలుస్తోందని తెలిపాడు. తనతోపాటు కుటుంబానికి ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని.. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని, సీబీఐ అధికారులను కోరానని తెలిపాడు. తాను ఎవరి ఒత్తిడితోనూ అప్రూవర్ గా మారలేదని, అప్రూవర్ గా మారడంలో తనపై ఇతరుల ప్రలోభాలు లేవని దస్తగరి స్పష్టం చేశాడు.

నో ప్రొటెక్షన్

నో ప్రొటెక్షన్

గతంలో తనకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరానని ఆయన వివరించారు. కానీ ఒక్క కానిస్టేబుల్‌ను మాత్రమే తనకు రక్షణగా ఇచ్చారని తెలిపారు. తనకు మరింత భద్రత కల్పించాలని కోరాడు. తాను డబ్బులు ఇస్తే అప్రూవర్ గా మారనని మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదని.. భార్యాబిడ్డల కోసమే అప్రూవర్‌గా మారనని మీడియా ముందు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+