అమరావతిలో అత్యుత్తమ ప్రమాణాలతో 'మీడియా ఇన్‌స్టిట్యూట్‌'...ఈవోఐ ఆహ్వానించిన సిఆర్డీఏ

అమరావతి:అమరావతిలో నెలకొల్పబోయే మీడియా సిటీలో అంతర్భాభాగంగా అత్యున్నత స్థాయి మీడియా ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి స్థాపించాలని సీఆర్డీయే నిర్ణయించింది.

దీంతో ఇందుకోసం ప్రముఖ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌)లను ఆహ్వానిస్తూ సిఆర్డీఏ నోటిఫికేషన్‌ ఇచ్చింది. రాజధాని ఆర్థిక అభ్యున్నతి కోసం అమరావతిలో 9 థీమ్‌ సిటీలు నిర్మించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఒకటైన మీడియా సిటీ ప్రాజెక్ట్ ద్వారా 2036 నాటికి 60,000 నుంచి 65,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

CRDA issued EOI for establish of Media Institute in Amaravathi

ఇందుకోసం దాదాపు 40వేల పోస్టులకు వెల్ ట్రెయిన్డ్ ప్రొఫెషనల్స్‌ అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా రంగం అవసరాలకు తగ్గట్లుగా అభ్యర్థులకు ఉత్తమ శిక్షణను ఇచ్చేందుకు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉండాలని సీఆర్‌డీయే భావించింది. ఇందుకోసం సుప్రసిద్ధ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ఈవోఐలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఈనెల 25న విజయవాడలోని సీఆర్డీయే కార్యాలయంలో ఈ మీడియా ఇన్ స్టిట్యూట్ స్థాపనకు సంబంధించి ప్రి-ఈవోఐ సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలావుండగా ఆంధ్ర సబ్‌ ఏరియా కమాండ్‌ రాష్ట్ర కేంద్ర కార్యాలయ మోడరన్‌ మిలటరీ స్టేషన్‌ను కూడా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠతో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జనరల్‌ ఎన్‌. శ్రీనివాసరావు వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మిలటరీ స్టేషన్‌ ఏర్పాటుకు, ఉద్యోగుల నివాస సముదాయ నిర్మాణానికి పదెకరాల భూమిని కేటాయించాలని శ్రీనివాసరావు సిఎస్‌ను కోరారు. దీనికి సిఎస్ పునేఠా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+