హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్ఫ్డ్‌డ్ న్యూడ్ ఫొటో: భార్యకు భర్త వేధింపులు (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భార్య పేరు మీద ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి భార్యను, ఆమె కుటుంబ సభ్యులను వేధిస్తున్న ప్రబుద్ధుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు నిందితుడిని జమ్మూ కాశ్మీర్‌లోని బటోలీలో గల పాట్నీ టాప్‌కు చెందిన అష్వాక్ ఎఁ వానిగా గుర్తించారు.

నకిలీ ప్రొఫైల్ సృష్టించి సందేశాలు పంపుతూ బెదిరిస్తూ వ్చచాడు. కోర్టు ద్వారా అతను భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె సెల్ ఫోన్‌కు అసభ్యకరమైన, బెదిరింపులతో కూడిన సందేశాలు రావడం ప్రారంభించాయి. ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు కూడా నకిలీ ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టాడు.

సయిదా షకీలా ఐడితో తన ఫొటోను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటో పోస్టు చేసినట్లు ఆమె గుర్తించింది. షామీర్‌పేటలో ఐవివై లీగ్ అకాడమీలో ఎస్టేట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మాజీ భర్త పనే అయి ఉంటుందని ఆమె అనుమానించింది.

Creating fake Profile in Facebook on the name of his wife and harassed

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను 2010లో జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. షామీర్‌పేటలోని ఐవివై లీగ్ అకాడమీలో చేరి బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు.

ఇద్దరు అత్తాపూర్‌లో కాపురం పెట్టారు. కాపురాన్ని అత్తాపూర్ నుంచి షామీర్‌పేటకు మారుద్దామని నిందితుడు ఒత్తిడి చేస్తూ వచ్చాడు తాను ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తుండడంతో దానికి ఆమె అంగీకరించలేదు. దాంతో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. అదే సమయంలో అతను ఆమె శీలాన్ని శంకిస్తూ వచ్చాడు.

అతను షామీర్‌పేటకు మారిపోయాడు. దాంతో బాధితాురాలు వరంగల్‌లో విడాకులకు దరఖాస్తు పెట్టుకుంది. అయితే, నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాంతో ద్వేషం పెంచుకున్న నిందితుడు ఈ ఏడాది మార్చి 23వ తేదీ నకిలీ ఫ్రొఫెల్‌తో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. అప్పటి నుంచి అసభ్యకరమైన ఫొటోలు పోస్టు చేస్తూ వచ్చాడు.

English summary
The accused by name Ashwaq M Wani aged about 38 yrs, Estate Manager Ivy league Academy Shamirpet, was arrested by Cyber Crime Police, Cyberabad for Creating fake Profile in Facebook on the name of his wife and harassed her and her family members by calling them, sending SMS and threatening them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X