పెళ్లైన 11 నెలలకే ఘోరం: బావను బలి తీసుకున్న బామ్మర్ది.. కారణం తెలిసి షాక్!

చెల్లెలి సంతోషం కోసం ఏదైనా చేసే అన్నలు ఎంతో మంది ఉంటారు. కానీ ఆమె బాధను భరించలేక తన పసుపు కుంకాలను దూరం చేశాడు ఓ అన్న. అలాంటి హృదయ విదారక ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. చెల్లెలిని వేధిస్తున్నాడనే కోపంతో, సొంత బావనే హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే..

లేపాక్షి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాజు చెల్లెలు మేఘనకు సుమారు ఏడాది క్రితం బెంగళూరు శివారులోని ఎలహంక ప్రాంతానికి చెందిన వినయ్ కుమార్‌తో వివాహం జరిగింది. వినయ్ తన అన్నతో కలిసి చిన్న ప్రైవేట్ సంస్థను నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. మేఘన కూడా అదే సంస్థలో పనిచేస్తూ, మొదట్లో దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. కానీ కొద్ది కాలానికే వారి మధ్య విభేదాలు తలెత్తాయి.

crime-news-about-brother-in-law-killing-sister-husband-due-to-family-issues-at-sri-satyasai-district

వినయ్ కుమార్ తన భార్యపై అనుమానం పెంచుకుని, తరచూ ఆమెను వేధించడం ప్రారంభించాడు. చిన్న విషయాలకే గొడవలు పెట్టడం, ఆమె ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఇంకా ఆమె అన్న రాజుకు ఫోన్ చేసి అవమానించడం రోజువారీగా మారింది. ఈ పరిణామాలు రాజులో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. చెల్లెలి బాధను తట్టుకోలేక, చివరకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనకు దిగాడు.

అదే ఆవేశంలో రాజు పక్కా ప్రణాళిక రూపొందించి, వినయ్‌ను స్వగ్రామానికి పిలిపించాడు. గ్రామ సమీపంలోని Handri Neeva canal వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని, అతని బైక్‌తో పాటు కాలువలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కొద్ది రోజుల తర్వాత కాలువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.

కాగా ఇదే సమయంలో వినయ్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో, కాలువలో లభించిన మృతదేహం వినయ్‌దేనని నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కాల్ డేటాను పరిశీలించగా, చివరిసారిగా రాజే వినయ్‌ను సంప్రదించినట్లు బయటపడింది. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించగా, తన చెల్లెలిపై జరిగిన వేధింపుల కారణంగా కోపంతోనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+