పెద్ద నగదునోట్ల రద్దు ఎఫెక్ట్ ,కూతురు వివాహం కోసం తండ్రి కష్టాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

దుగ్గిరాల : పెద్ద నగదు నోట్ల రద్దుతో కూతురు వివాహం చేసేందుకు బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసేందుకు ఆంక్షలు ఇబ్బందిగా మారాయి. ఈ ఇబ్బందుల కారణంగా కూతురు వివాహం ఎలా చేయాలని ఆయన ఆందోళన చెందుతున్నాడు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని దుగ్గిరాల మండలంలోని పెనుమూలికి చెందిన మద్దుకూరి శ్రీనివాసరావు తన కుమార్తె పెళ్ళి కోసం ఆంద్రాబ్యాంకులో లక్షా 50 వేల రూపాయాలను డిపాజిట్ చేశాడు.పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

currency ban effect on marrage in guntur district

రద్దు చేసిన నగదు నోట్లను ఆయన ఇటీవలే ఆంద్రాబ్యాంకులో జమచేశాడు. డిసెంబర్ 4వ, తేదిన కూతురు వివాహం ఉంది. ఈ వివాహ పనుల కోసం ఆయన బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు.

నవంబర్ 8వ, తేది నాటికి బ్యాంకులో డిపాజిట్ నగదు ఉంటేనే ఆ నగదును వివాహల కోసం ఇచ్చేందుకు ఆర్ బి ఐ సూచించిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. శ్రీనివాసరావు నవంబర్ 8వ, తేది తర్వాత ఈ నగదును బ్యాంకులో జమ చేశాడు. అయితే చేతిలో రద్దు చేసిన నగదు లేదు, కొత్త కరెన్సీ వివాహ ఖర్చుల కోసం తీసుకోలేదు . ఏం చేయాలోనని ఆయన ఆందోళన చెందుతున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
currency ban effect on marrage, srinivasa rao native of duggirala mandal penumuli village. his daughter marrage on dec 4. he is deposit 1.50 lakhs in andhrabank after nov 8th. bank officers not accept for give for marrage purpose.
Please Wait while comments are loading...