మంత్రి నారా లోకేష్ కి బిగ్ షాక్.. రూ.54 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు !!
మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో.. అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి. హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్‌లైన్ మోసాలు, రాన్సమ్‌వేర్ దాడులు సర్వసాధారణమైపోతున్నాయి. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు పేర్లను ఉపయోగించి ప్రజలను మోసం చేసే కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా బెదిరింపులు, విరాళాల పేరుతో డబ్బులు సేకరణ, QR కోడ్ స్కామ్స్ వంటి మోసాలు పెరుగుతున్నాయి. అయితే ఈసారి సామాన్యులను కాకుండా ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ దోపిడి చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..
సీఐడీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు నారా లోకేష్ ఫోటోతో వాట్సాప్ అకౌంట్ సృష్టించారు. తర్వాత, ఒక వ్యాపారవేత్తను టార్గెట్ చేసి "ప్రత్యేక ప్రాజెక్టుల కోసం డబ్బు అవసరం ఉంది, తక్షణమే పంపించండి" అంటూ మంత్రి తరహాలో మెసేజ్‌లు పంపారు. నమ్మిన బాధితుడు అనుకున్న ఖాతాలో మొత్తం రూ.54 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసపోయామని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ ఈ కేసును స్వీకరించింది.
సాంకేతిక ఆధారాలను పరిశీలించి ప్రధాన నిందితుడు రాజేష్ (A1) ను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ విచారణలో ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు హైదరాబాద్‌లో సాయి శ్రీనాథ్, సుమంత్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. సీఐడీ అధికారులు ఈ మోసం వెనుక ఇంకా పెద్ద గ్యాంగ్ ఉందని అనుమానిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, ఫోన్ రికార్డులు, IP అడ్రస్‌లు, డిజిటల్ పేమెంట్ ట్రైల్స్‌న్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై సీఐడీ అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఏ మంత్రులు లేదా ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications