సైకిల్ డౌన్ డౌన్.. తెలుగు తమ్ముళ్ళ నినాదాలు; ఇదేం ఖర్మ టీడీపీకి!!
ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఆందోళనలు చేస్తారు. ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత పార్టీపైనే వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘనకార్యం చేసింది ఎవరో కాదు సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లు.
స్వయానా టిడిపి నాయకులే సైకిల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం సంతవేలూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ హెలెన్, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని సంత వేలూరు గ్రామంలో నిర్వహించారు .

ఇక గ్రామంలో పర్యటిస్తూ ఇదేమి ఖర్మ కార్యక్రమాన్ని నిర్వహించిన టిడిపి నాయకులు సైకిల్ జిందాబాద్ అనాల్సిన చోట సైకిల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక పార్టీ శ్రేణులు సైతం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున గట్టిగా నినాదాలు చేయడంతో జనాలందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదేంటి సైకిల్ డౌన్ డౌన్ అంటున్నారు అంటూ ముక్కున వేలేసుకున్నారు.
ఆపై సంత వేలూరు మాజీ సర్పంచి ఇంటి వద్దకు వెళ్ళిన తెలుగు తమ్ముళ్ళు ఇంటిముందు అంటించిన మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను తొలగించడానికి టిడిపి నేతలు ప్రయత్నించగా, వారికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్ స్టిక్కర్ ను తొలగించడం దేనికి అంటూ ఆమె ప్రశ్నించారు.
సైకిల్ డౌన్ డౌన్.. తెలుగు తమ్ముళ్ళ నినాదాలు; ఇదేం ఖర్మ టీడీపీకి..!!#TDP #TeluguDesamParty #AndhraPradesh #Chandrababu #ApPolitics #Oneindiatelugu pic.twitter.com/BIzi3UZBRj
— oneindiatelugu (@oneindiatelugu) April 25, 2023
మొత్తంగా సత్యవేడు నియోజకవర్గంలో టిడిపి నేతలు నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం తెలుగు తమ్ముళ్లను నవ్వుల పాలు చేసింది. సైకిల్ డౌన్ డౌన్ అంటూ వారు చేసిన నినాదాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీ కోసం పని చెయ్యకున్నా, పార్టీ పరువు ఇలా తియ్యకండర్రా అంటూ ఈ వీడియో చూసిన వారు నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications