Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తుఫాన్ ఎఫెక్ట్, మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్..!!

దిత్వా తుఫాను బలహీన పడుతోంది. ప్రభావం మాత్రం కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఈ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్స్ జారీ చేసింది. భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరుమల, తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు పైనా తుఫాను ప్రభావం పడింది. కాగా.. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ముందస్తు చర్యలు చేపట్టారు.

దిత్వా తుఫాను చెన్నైకి 50 కిమీ, పుదుచ్చేరీకి 130 కిమీ, నెల్లూరు కు 200 కిమీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. కాగా, రాబోయే మూడు రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరు పతి, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. దిత్వా తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజలు సరైన జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు దిశానిర్దేశం చేశారు. చైన్నై తీరానికి దగ్గరగా.. ఉత్తర దిశగా పయని స్తోందని తెలిపారు. తుఫాను గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వివరించారు. దీంతో మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

cyclone-ditwah-brings-light-rain-to-nellore-and-tirupati-with-heavy-rain-and-strong-winds-expected

తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా మారడంతో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు, విశాఖ, మచిలీపట్నం, కాకినాడ సహా ఇతర పోర్టులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. దిత్వా తుఫాన్‌ బీభత్సం సృష్టించే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావంపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న పెన్నా పరివాహక ప్రజలను అలర్ట్‌ చేయాలని ఆదేశించారు. వరద నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+