దక్షిణ కోస్తాకు 'వాయుగండం': అప్రమత్తమైన అధికార యంత్రాంగం

అమరావతి: భారతదేశంలోకి ఎప్పుడెప్పుడూ రుతుపవనాలు వస్తాయా? అంటూ ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తే. సాధారణంగా జూన్ మొదటి వారం తర్వాత వచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వాతావరణంలో సంభవించిన మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రతకు ప్రజలు భయభ్రాంతులకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించాయనే వార్త రైతులతో పాటు అందరికీ కాస్తంత సంతోషాన్ని కలిగిస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నైరుతి రుతి పవనాలు భారత సరిహద్దుల్లో ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు మరో వారం రోజుల్లో ఈ రుతు పవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.

Cyclone to form in Bay of Bengal, Tamil Nadu and Andhra coast on alert

దీనికి తోడు ఈ ఏడాది అంచనాలకు మించి వర్షపాతం నమోదవుతుందని అధికారులు హెచ్చరించారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం అర్ధరాత్రి తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.

వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని సూచించింది.

మరోవైపు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నెల్లూరు తీరంలో ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. మత్స్యకారులెవరూ సముద్రంలో ప్రవేశించవద్దని హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లురుపేట, కావలిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+