శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: 250 రోజులకు సరిపడేలా..!!

Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛౌంగ్ తుఫాన్ మహోగ్రంగా మారింది. అతి పెను తుఫాన్‌గా ఆవిర్భవించింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నెల్లూరు- మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ సాయంత్రానికి బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాయలసీమ మొదలుకుని ఉత్తరాంధ్ర వరకూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది.

Cyclone Michaung: All dams in Tirumala are full with the incessant rains

నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి, బాపట్ల.. జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. శనివారం మొదలైన వర్షాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. తెరిపి ఇవ్వట్లేదు. ఆయా జిల్లాల్లోని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతి చెరువు మరోసారి నిండిపోయింది.

అటు తిరుమలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘాట్ రోడ్లల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

Cyclone Michaung: All dams in Tirumala are full with the incessant rains

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని అయిద ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. ఫుల్ ట్యాంక్ లెవెల్‌‌కు చేరుకున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార.. రిజర్వయార్లు తిరుమలకు ప్రధాన నీటి వనరులు.

ఆయా రిజర్వాయర్ల నుంచే తిరుమలకు నీటి సరఫరా అందుతుంది. తిరుమలలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆయా జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. అటు తిరుపతి కల్యాణి రిజర్వాయర్ సైతం జలకళను సంతరించుకుంది.

పాప వినాశనం- 693.60, గోగర్భం- 2887, ఆకాశగంగ- 859.80, కుమారధార- 896.20, పసుపుధార- 895.90 మీటర్ల మేరకు చేరుకున్నాయి. ఈ నీటిమట్టాలు తిరుమలకు దాదాపు 250 రోజుల మంచినీటి అవసరాలకు సరిపోతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+