Daikin in AP: ఏపీలో డైకిన్ కార్యకలాపాలు-జగన్ ప్రభుత్వానికి థ్యాంక్స్,ఉపాధి ఎంతమందికంటే..!

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మకమైన సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది.జపాన్‌కు చెందిన ప్రముఖ ఏసీ తయారీ సంస్థ డైకిన్ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌‌ను ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీసిటీలో ప్రారంభించింది.75.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. 3వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తోందని డైకిన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

శ్రీసిటీలో నిర్మాణమైన డైకిన్ సంస్థ క్లైమేట్ ఫ్రెండ్లీగా ఉండే ఎయిర్‌ కండీషనర్లను ఉత్పత్తి చేస్తుంది.ఇక్కడ తయారైన ఎయిర్ కండీషనర్లు పశ్చిమ ఆఫ్రికా, శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ పేర్కొంది.

Daikin starts its activities in Sricity of AP,thanks Jagan govt for timely help

శ్రీసిటీలో నెలకొల్పిన నూతన డైకిన్ ప్లాంట్‌ ద్వారా తమ ఉత్పత్తి పెరగడంతో పాటు ఆయా దేశాల వాతావరణం పర్యావరణానికి అనుగుణంగా ఏసీలను తయారు చేస్తామని డైకిన్ ఇండియా ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్జీత్ జవావా పేర్కొన్నారు. 100 దేశాల్లో డైకిన్ మానుఫాక్చరింగ్ యూనిట్లున్నాయని, భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌లో మరో యూనిట్‌ను నెలకొల్పడం ద్వారా సంస్థ మరింత బలోపేతమయ్యిందని డైకిన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ మసనోరి తొగావా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పిన డైకిన్ సంస్థ నుంచి ఏడాదికి 1.5 మిలియన్ రూమ్ ఎయిర్ కండీషనర్లు తయారు అవుతుండగా.. 3 మిలియన్ల కంప్రెసర్ల ఉత్పత్తి జరుగుతుంది.దేశంలో డైకిన్ నుంచి ఏర్పాటైన మూడవ యూనిట్ ఏపీలో నెలకొల్పారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో డైకిన్ ఏసీలకు ఉన్న డిమాండ్ మేరకు మరో సంస్థను ఏపీలో ఏర్పాటు చేయడం జరిగింది.

Daikin starts its activities in Sricity of AP,thanks Jagan govt for timely help

ఇక డైకిన్ ప్లాంట్ ఏర్పాటులో వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన సహకారం అద్భుతమని ఆ సంస్థ యాజమాన్యం కొనియాడింది. ఏపీలో సంస్థ ఏర్పాటు చేయడంతో స్థానికంగా చాలామందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొంది. ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు శరవేగంగా లభించినట్లు యాజమాన్యం పేర్కొంది. ప్రారంభించిన 18 నెలల్లోనే యూనిట్‌ను సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాష్ఠ్రంలో ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా 75శాతం నియామకాలు స్థానికులకే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనతో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)తో డైకిన్ సంస్థ అగ్రిమెంట్ చేసుకుంది. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినట్లు డైకిన్ వెల్లడించింది. ఎంపికైన వారికి రూ.1.99 లక్షలు వేతనం ఇస్తున్నట్లు డైకిన్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+