రోజూ తలస్నానం చేస్తే బట్టతల వస్తుందా?

పురుషులు సాధ్యమైనంతవరకు ప్రతి రోజు తలస్నానం చేస్తుంటారు. స్త్రీలు మాత్రం వారానికి రెండుసార్లు లేదంటే మూడుసార్లు చేస్తుంటారు. ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిది కాదని, జుట్టు రాలుతుందని, బట్టతల కూడా వస్తుందని చెబుతుంటారు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

తలస్నానం ప్రతిరోజూ చేయడం వల్ల జుట్టు రాలుతుందనడంలో ఎలాంటి నిజం లేదని..నిపుణులు చెబుతున్నారు. రోజూ తలస్నానం చేయడంవల్ల జుట్టుకు హాని జరగదన్నారు. జుట్టు కూడా రాలదని.. బట్టతల వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. జుట్టు ఊడిపోవడానికి పలు కారణాలున్నాయి. జన్యు కారణాలు, హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యలవంటివి జట్టు ఊడిపోవడానికి కారణమవుతాయి.

 headbath

తలస్నానం చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్నానం చేసేటప్పుడు సాధారణంగా అందరూ షాంపూలే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువ గాఢత లేని షాంపూలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. గాఢత ఎక్కువగా ఉంటే తలపై ఉండే చర్మం దెబ్బతింటుంది. షాంపూ పెట్టుకున్న తర్వాత జుట్టును పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. లేదంటే హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోయి జుట్టు ఊడిపోయే ప్రమాదముంది.

ప్రతీ రోజు హెయిర్ వాష్ తర్వాత జుట్టు సంరక్షణ కోసం హెయిర్ కండీషన్ ను ఉపయోగిస్తుండాలి. దీనివల్ల జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. సాధారణంగా రోజుకు ఓ వ్యక్తికి 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం సహజంగా జరిగేదే. ఇలా జుట్టు ఊడిపోయినచోట కొత్త జుట్టు వస్తుంది. జుట్టు ఎక్కువగా ఊడితే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+