పవన్ ఇలాకా పిఠాపురంలో అమానుషం.. దళితుల గ్రామ బహిష్కరణ?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో దళితుల గ్రామ బహిష్కరణ అంశం కలకలం రేపుతోంది. సాక్షాత్తు పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల గ్రామ బహిష్కరణ అంశంపై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ ఘటనపై కాకినాడ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.

పిఠాపురం నియోజకవర్గంలోని మల్లం గ్రామంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కుటుంబాలు.. దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు కావస్తున్నా.. ఇలాంటి చర్యలు ఏంటని స్థానిక గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.

ఏం జరిగింది..?

ఈనెల 16న మల్లాం గ్రామానికి చెందిన జల్లిబాబు ఇంట్లో కరెంట్ పని చేస్తూ ప్రమాదవశాత్తు అదే గ్రామానికి చెందిన పల్లపు సురేశ్ అనే దళితుడు మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. నష్టపరిహారం కింద రూ. 2.75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన అగ్రవర్ణాల కుటుంబాలు.. దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు.

Dalits Evicted from Mallam Village in Pithapuram Inhumane Incident Sparks Outrage

దళితులు వస్తువులు అమ్ముకోకుండా హుకుం జారీ చేశారు. గ్రామంలో ఓ వర్గానికి చెందిన వారికి హోటళ్లలో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వొద్దని, నిత్యావసరాలు విక్రయించొద్దని ఆంక్షలు విధించారు. ఆదేశాలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ మేరకు పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఆర్డీఓ మల్లిబాబు వచ్చి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+