అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం..?
నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరుఫున అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలని భావించారు.
అయితే ఆయను మొండిచేయి ఎదురైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. సీటు విషయంలో ఆశ భంగం కలిగింది. దీనికి తోడు ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెందడంతో ఇక ఆ పార్టీని వీడేందుకు అలీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీకి మద్దతు తెలిపిన కొద్దిమంది ఇండస్ట్రీవాళ్లలో అలీ కూడా ఒకరు. పార్టీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు.

అయితే అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తం హస్తం ఉందనే రూమర్ తెర మీదకు వచ్చింది. ఆ వ్యక్తి ఇచ్చిన సూచనతోనే అలీ వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ చాలా అవమానాలను ఎదుర్కొందని, సినిమా వాళ్లను జగన్ ఘోరంగా అవమానించారని విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే అలీ వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
పైగా పార్టీలో తనకు సముచిత స్థానం దక్కకపోవడం, ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అలీ రాజీనామాపై వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని ఎదురిస్తే అవకాశాలు దక్కవనే విషయం తెలిసిందేనని, గతంలో ఇది పలుమార్లు రుజువు అయిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అలీకి సినిమాలు తప్పిస్తే మరే వ్యాపార కార్యకలాపాలు లేవని బాహుశ అందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఉండవచ్చనే అభిప్రాయం వైసీపీ నాయకులు వెళ్లబుచ్చుతున్నారు.












Click it and Unblock the Notifications