లోకేష్ హార్ట్ టచ్ చేసిన మోదీ వీడియో- అది మా జిల్లా జాతికి చెందినదే
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన కోడె దూడ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు తాము పెంచుకుంటోన్న దూడ ఫొటోలను షేర్ చేస్తోన్నారు. వాటిని ఎత్తుకున్న ఫొటోలు, దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తోన్నారు.
ఆ దూడ చిత్తూరు జిల్లా పుంగనూరు మేలురకం జాతికి చెందినది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పీవీపీ సహా ఏపీకి చెందిన బీజేపీ నాయకులు దీని గురించి ప్రస్తావిస్తోన్నారు. ప్రధాని మోదీ పోస్ట్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం దీనిపై స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మోదీ పోస్ట్ చేసిన ఈ దూడ వీడియోను ఆయన కూడా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియో తన హార్ట్‌ను టచ్ చేసిందని కామెంట్స్ పెట్టారు. దీపజ్యోతి దూడ- తన సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు జాతికి చెందినదని నారా లోకేష్ వివరించారు. ప్రధాని మోదీ నివాసంలో ఏపీకి చెందిన దూడ అల్లారుముద్దుగా పెరుగుతోండటం ఆనందాన్ని ఇస్తోందని అన్నారు.
శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఈ దూడ వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆవు సర్వ సుఖ ప్రదం అనే సంస్కృత పదాలను దానికి జత చేశారు. ఎంతో ఆప్యాయంగా దూడను నిమురుతూ, ముద్దాడుతూ కనిపించారు. ఆనందంతో పొంగిపోతున్నట్లు చెప్పుకొచ్చారు.
This is a heart touching video. I am even more happy because Deepjyoti belongs to the Punganur cattle family, which hails from my home district of Chittor in Andhra Pradesh.
— Lokesh Nara (@naralokesh) September 14, 2024
It is always a delight for us to see a little bit of Andhra Pradesh in PM's residence! https://t.co/Xf7ysWhjr6
అమ్మవారికి పూజ చేసే సమయంలో దాని మెడలో పూలదండను వేశారు. శాలువ కప్పారు. తెల్లరంగుతో ఓ నామం ఉండటం ఈ లేగదూడకు ప్రత్యేక ఆకర్షణ. తన చేతులతో ఎత్తుకుని ఎంతో మురిపెంగా ఇంట్లో కలియతిరిగారు మోదీ. ఇంటి బయట తోటలో మురిసిపోతూ దానితో ఆడుకున్నారు.
ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా నిత్యం తీరిక లేకుండా గడిపే ప్రధాని మోదీ.. ఖాళీ సమయంలో మూగ జీవాలు, పక్షులతో సేదదీరుతుంటారని మరోసారి రుజువైంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉంటోన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications