తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతోనే.. మాటిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐదు ముఖ్యమైన శాఖల మంత్రిగా ఏపీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా కీలక శాఖలను నిర్వహించనున్నారు.

డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి ఇన్ స్టాలో పవన్ కళ్యాణ్ పోస్ట్
నిన్న విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేకమంది తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఆయన తన కర్తవ్యాన్ని తెలియజేశారు.

Deputy CM Pawan Kalyan gave assurance with the first Instagram post

బాధ్యత పెరిగింది
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నందుకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తన బాధ్యతలు మరింత పెరిగాయని, నేను నా రాష్ట్రానికి బాధ్యతతో పని చేస్తానని పవన్ కళ్యాణ్ ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. బాధ్యతతో పని చేస్తానని ఆయన రాష్ట్రప్రజలకు హామీ ఇచ్చారు.

ప్రతీ ఒక్కరి భవిష్యత్ కోసం పని చేస్తాం
ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం, ఏపీ ప్రజలకు తన వంతుగా మంత్రిగా అవకాశం వస్తే త్రికరణ శుద్ధితో పని చేస్తానని గతంలో కూడా చెప్పిన పవన్ కళ్యాణ్, ప్రజల కోసం, ఏపీ ప్రజల భవిష్యత్ కోసం పని చేస్తానని పేర్కొన్నారు.

వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్
ఇక అందులో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వీడియోను షేర్ చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి తన ఛాంబర్ వరకు రావడం పూజలు నిర్వహించడం, ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి కీలక ఫైళ్ళ మీద సంతకాలు చేయడం, పలువురు అధికారులను కలవడం వంటి దృశ్యాలను చూపిస్తూ చేసిన ఒక వీడియోను పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+