Pawan Kalyan: దత్త గ్రామం కొణిదెలకు పవన్ ఏం చేశారో చూశారా ?

తన ఇంటిపేరు కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉందని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan).. దాన్ని గతంలో దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ గ్రామానికి తన శాఖ తరఫున చేయాల్సిందంతా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పవన్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టిందని ఇప్పుడు కూటమి నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రూ.50 లక్షల విరాళం అందించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ, గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ తదితర పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, కాలువల అభివృద్ధి, గోకులాలు, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపట్టారు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటి వరకు సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామాభివృద్ధికి ఖర్చుచేశారు.

Pawan Kalyan s Adopted Village Konidela A Showcase of High-Impact Development Works

2019 ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కొణిదెల వాసులు పవన్ కళ్యాణ్ ను కోరారు. తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. గత ఏడాది నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. ఈ నిధులతో గ్రామానికి అవసరం ఉన్న అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

Pawan Kalyan s Adopted Village Konidela A Showcase of High-Impact Development Works

దీంతో అధికారులు గ్రామంలో తాగునీటి సమస్యను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రూ.50లక్షలతో ఇక్కడ 90 వేల లీటర్ల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ ట్యాంక్ కొణిదెల గ్రామం పరిధిలో 2 వేల మంది దాహార్తి తీర్చనుంది. వేసవికి ముందే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+