లేడీ డ్యాన్సర్‌తో డిప్యూటీ మేయర్ చిందులు!: వీడియో హల్‌చల్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డిప్యూటీ మేయర్ చిందులు వేస్తున్నట్లు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది ఇప్పుడు డిప్యూటీ మేయర్‌కు చిక్కులు తెచ్చిపెడుతోంది.
ఇటీవల ఏలూరులో మేయర్ ఇంటి ఎదుట జరిగిన ఓ పార్టీలో డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు. ఈ పార్టీలో వారు సంతోషంగా గడిపారు. అదే సమయంలో విద్యుత్ వెలుగులతో జిగేల్ మంటున్న ఆ వేదిక పైన లేడి డ్యాన్సర్‌తో కలిసి డిప్యూటీ మేయర్ వెంకటరత్నం చిందులేసినట్లుగా చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లేడీ డ్యాన్సర్‌తో డిప్యూటీ మేయర్ కలిసి చిందులు వేశారంటూ ఆ వీడియో ఉంచారు. ఇప్పటికే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించారన్న కేసులో అరెస్టైన వెంకటరత్నం బెయిల్ పైన బయటకు వచ్చారు.

విద్యుదాఘాతంతో ఇద్దరు చిన్నారుల మృతి
పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవేగి మండలం భోగాపురం బైబిల్ స్కూలులో విషాదం చోటు చేసుకుంది విద్యుదాఘాతంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.
కడప జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లె దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మరణించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు మొగిలిచెరువువాసులుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ?












Click it and Unblock the Notifications