భక్తజన సంద్రంగా శబరిమల.. అయ్యప్ప ఆలయం వద్ద తాజా పరిస్థితి ఇలా!!

శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఒక్క కేరళ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనానికి తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో భక్తులు క్యూ లైన్లలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. కొంతమంది భక్తులు దర్శనం కాకుండానే వెను తిరుగుతున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం సామాన్యంగా దొరకటం లేదు. ప్రస్తుతం శబరిమల భక్త జనసంద్రంగా మారి, అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగుతుంది.

Devotees rush to Sabarimala.. This is the latest situation at Ayyappa Temple!!

శబరిమల కు వెళ్లే దారుల్లో భారీ ట్రాఫిక్ జాములు నెలకొంటున్నాయి. దీంతో దారిలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయ్యప్ప స్వామి భక్తులు. రోజుల తరబడి రోడ్లపై వాహనాలు బారులు తీరడంతో శబరిమలకు వెళుతున్న అయ్యప్ప భక్తులు తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ ఇబ్బందులను పరిష్కరించాలని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళుతున్న భక్తుల రద్దీ దేవస్థానం అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో వసతులు సరిపోవటం లేదు. ఇదిలా ఉంటే శబరిమలకు భక్తులు ఎక్కువగా వెళుతూ ఉండటంతో భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే భారీగా ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది.

Devotees rush to Sabarimala.. This is the latest situation at Ayyappa Temple!!

శబరిమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లే వారి కోసం తెలుగు రాష్ట్రాలలో వేరువేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబరు, జనవరి నెలలలో వివిధ తేదీల్లో మొత్తంగా 51 ప్రత్యేకమైన రైళ్ళను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది . వివిధ తేదీలలో రాకపోకలు సాగించే రైళ్ల నెంబర్లు, తేదీలతో పాటు పలు వివరాలను ఎక్స్ లో షేర్ చేసింది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసి, సెకండ్ క్లాస్ ఏసి, థర్డ్ క్లాస్ ఏసీ తో పాటు, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుండి వివిధ తేదీలలో ఉన్న ప్రత్యేక రైళ్ళ చార్ట్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+