చింతకాయల విజయ్‌కు చంద్రబాబు బంపర్ ఆఫర్?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వారసుడు చింతకాయల విజయ్ త్వరలోనే పెద్దల సభకు వెళ్లనున్నారా? ఐటీడీపీ, సీబీఎన్ ఆర్మీలో చురుకైన పాత్ర పోషించిన ఈ యువనేతకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చింతకాయల కుటుంబానిది దశాబ్దాల అనుబంధం. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా నమ్మకంగా నిలబడిన కుటుంబం వారిది. ఇప్పుడు అదే నమ్మకమే అయ్యన్న తనయుడు విజయ్‌కు రాజకీయంగా పెద్దపీట వేయబోతుందా అనే ఉత్కంఠ రేపుతోంది.
ఖాళీ అయ్యే స్థానాలు ఇవే..
వచ్చే ఏడాది అంటే 2026, జూన్ 21న ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం ఉన్న వారిలో..పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (వైసీపీ),పరిమళ్ నత్వానీ (వైసీపీ మద్దతుతో ఎన్నికైన పారిశ్రామికవేత్త),సానా సతీష్ బాబు (టీడీపీ మద్దతు ఉన్న ఎన్నారై నేత), వీరికి ఈ ఏడాదిలో పదవుల సమయం ముగుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి ఉన్న తిరుగులేని బలాన్ని బట్టి చూస్తే, ఈ నాలుగు స్థానాలు కూటమికే దక్కడం ఖాయం. ఇందులో సానా సతీష్‌కు మరోసారి అవకాశం దక్కవచ్చని, అలాగే బీజేపీ కోటాలో నత్వానీ పేరు మళ్ళీ పరిశీలనకు రావచ్చని ప్రచారం జరుగుతోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకదానిని బిసి సామాజిక వర్గానికి చెందిన యువ నేతగా, పార్టీ విధేయుడిగా ఉన్న చింతకాయల విజయ్‌కు కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

నర్శీపట్నం నుంచి ఢిల్లీ దాకా..
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే విజయ్ నర్శీపట్నం నుంచి పోటీ చేయాలని భావించారు. అయ్యన్నపాత్రుడు కూడా తన వారసుడిని బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. కానీ, అప్పటి రాజకీయ సమీకరణాలు, గెలుపు గుర్రాల లెక్కల దృష్ట్యా చంద్రబాబు మళ్ళీ అయ్యన్నకే టికెట్ ఇచ్చారు. తన తండ్రి కోసం, పార్టీ క్రమశిక్షణ కోసం వెనక్కి తగ్గిన విజయ్, ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు.
విజయ్‌కు కలిసొచ్చే అంశాలు..
దశాబ్దాలుగా చింతకాయల కుటుంబం టీడీపీ వెంటే ఉండటం.లోకేష్ నమ్మకస్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉండటం.ఐటీడీపీ ద్వారా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు.అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా గౌరవప్రదమైన పదవిలో ఉండగా, ఆయన వారసుడు విజయ్ రాజ్యసభకు వెళ్తే అది ఉత్తరాంధ్ర టీడీపీకి మరింత ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ వాణిని వినిపించే సత్తా ఉన్న విజయ్ వంటి యువనేతలకు అవకాశం ఇస్తే, భవిష్యత్తులో పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం ఆలోచన. దీనిలో భాగంగానే చింతకాయల విజయ్‌ను పెద్దల సభకు పంపించడానికి చంద్రబాబు రెడీ అవుతున్నట్టు సమాచారం
-
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications