బాబు ఇష్యూపై దిగ్విజయ్: తెలియదని జవదేకర్, కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్టీపెన్ సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఆ ఫోన్ సంభాషణలు చంద్రబాబువే అయితే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు సూత్రధారి అయితే మాత్రం వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని చెప్పారు.

తెలియదు: ప్రకాశ్ జవదేకర్
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు అంశంలో ఏసీబీకి చిక్కిన మిత్రపక్షం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయం తనకు తెలియదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ముగింపు సభలో ఆయన ఢిల్లీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులు రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి అడిగారు. ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తామని, ఏపీ, తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.
ఏపీలో భగ్గు
చంద్రబాబు వీడియోలు అంటూ విడుదలైన వాటి పైన ఆంధ్రప్రదేశ్ భగ్గుమంటోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. విజయవాడ పోలీసు స్టేషన్‌లో కేసీఆర్, జగన్‌ల పైన ఫిర్యాదు చేశారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం అవుతుందనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ కుట్రపూరితంగా చేస్తున్నారని మంత్రి శిద్ధా రాఘవ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications