పవన్ తో దిల్ రాజు భేటీ - మెగా ప్లాన్, 'గేమ్ ఛేంజర్' బిగ్ అప్డేట్..!!
ఏపీ వేదికగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మూవీ మేకర్స్ నిర్ణయించారు. తెలంగాణలో పుష్ఫ -2 ప్రీమియర్ షో .. తరువాత ప్రభుత్వ నిర్ణయం సంక్రాంతి సినిమాల పైన ప్రభావం పడింది. దీంతో, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయం లోనే గేమ్ ఛేంజర్ సహ నిర్మాత దిల్ రాజు పవన్ తో భేటీ కానున్నారు. చిరంజీవి సూచనతో దిల్ రాజు అడుగులు వేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు పవన్ ఇచ్చే డేట్ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు.
పవన్ తో దిల్ రాజు సమావేశం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాతగా ఉన్న దిల్ రాజు తాజాగా విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇదే వేదికగా దిల్ రాజు కీలక అప్డేట్ ఇచ్చారు. అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. తాను పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారు. పవన్ ను గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ కు పవన్
పవన్ కల్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5న ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తాం. జనవరి 1న ట్రైలర్, 10న సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ సారి నిర్వహించే ఈవెంట్ ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుంది. గేమ్ ఛేంజర్ విడుదల అయ్యాక... ఓజీ పబ్లిసీటికి షిప్ట్ అవుదామంటూ దిల్ రాజు అభిమానుల్లో జోష్ పెంచారు. తాను చిరంజీవికి ఫోన్ చేసి సినిమా చూడాలని కోరానని.. సినిమా చూసిన చిరంజీవి తనకు ఫోన్ చేసి మూవీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. సంక్రాంతికి మంచి హిట్ కొడుతున్నామని అభిమానులకు చెప్పాలని చిరంజీవి తనకు చెప్పారని వెల్లడిం చారు. మెగా పవర్ స్టార్‌లో మెగాస్టార్‌ను చూస్తారు.. పవర్ స్టార్‌ను కూడా చూస్తారని చెప్పుకొచ్చారు. శంకర్ నాలుగేళ్ల క్రితం సినిమా కథ చెప్పినప్పుడు ఒక ఫీల్ వచ్చిందన్నారు. చిరంజీవి సీన్ టూ సీన్ మాట్లాడుతుంటే.. తనకు చాలా ఆనందం వేసిందని.. రాంచరణ్ నట విశ్వరూపం ఈ సినిమా లో తప్పకుండా చూస్తారంటూ దిల్‌రాజ్ మరింత ఆసక్తి పెంచారు
పవన్ నిర్ణయం ఏంటి
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్ర గురించి వివరించారు. ఐఏఎస్ , పోలీస్ ఆఫీసర్‌గా, ఒక పొలిటికల్ లీడర్‌గా ఉండాల్సిన లక్షణాలతో రాంచరణ్ కనిపిస్తారని పేర్కొన్నారు. ఇక శంకర్ పాట లు కూడా బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని కలిగిస్తాయని వివరించారు. ఇదే సమయంలో ఏపీ లో బెనిఫిట్ షో, టికెట ధరల అంశం పైన దిల్ రాజు చర్చించే అవకాశం ఉంది. ముందుగా పవన్ ను గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేలా ఒప్పించనున్నారు. వన్ హాజరు ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తరువాత సంక్రాంతి సినిమాలకు బెనిఫిట్ షో , టికెట ధరల పెంపు పైనా చర్చించాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో, ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్ణయం గేమ్ ఛేంజర్ గా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications