పవన్ కల్యాణ్ తో విభేదాలు.. హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్?
హరిహరవీరమల్లు నుంచి ఆ సినిమా దర్శకుడు క్రిష్ తప్పుకున్నారంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో ప్రాజెక్టు చేసేందుకు ఒక బాలీవుడ్ కథానాయకుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. సినిమా షూటింగ్ చేయడానికి పవన్ కల్యాణ్ సరైనరీతిలో డేట్లు ఇవ్వకపోవడం, స్క్రిప్ట్ లో పదే పదే జోక్యం చేసుకోవడంలాంటివన్నింటినీ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కు విసుగు పుట్టించాయమంటున్నారు. దీంతో వేరే ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మణికర్ణికలో రీషూట్: గతంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా మణికర్ణిక సినిమా చేశారు. అయితే అందులో కంగనా రనౌత్ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చే సమయానికి ఆ ప్రాజెక్టు నుంచి క్రిష్ తప్పుకున్నారు. అయితే సినిమా టైటిల్స్ లో దర్శకుడిగా క్రిష్ పేరు ఉంచి ఆయనకు సాధ్యమైనంతమేర కంగన గౌరవాన్ని ఇచ్చింది. వీరమల్లును పాన్ ఇండియా సినిమాగా క్రిష్ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా తమ హీరో పాన్ ఇండియా సినిమా రాబోతోందంటూ సంతోషంలో ఉన్నారు.

టాలీవుడ్ లో సంచలనం:
ఇటువంటి తరుణంలో క్రిష్ అకస్మాత్తుగా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం కలిగిస్తోంది. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయంలో ఈ సినిమా ప్రారంభమైంది. వకీల్ సాబ్ రావడం.. బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టడం పూర్తయింది కానీ హరిహరవీరమల్లు మాత్రం ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉండిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో కరోనా కూడా ఒకటి. అయితే దీన్నికాదని పవన్ వేరే సినిమాలకు ప్రాధాన్యతనిచ్చారు.

ఓజీకి, ఉస్తాద్ కే డేట్లు: లాక్ డౌన్ తీసేయగానే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా చేశారు. ఈ సినిమా తర్వాత హరిహరవీరమల్లు షూటింగ్ ని కొనసాగించారు. ఏఎం రత్నం దీనికి నిర్మాత. బందిపోటు దొంగగా పవన్ పాత్ర చిత్రీకరణ ఉంటుంది. ఇటీవలే ఈ సినిమాను పక్కనపెట్టి బ్రో ని ప్రారంభించారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. దీనితర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ తెచ్చారు. నెలరోజులు ఈ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్ వీరమల్లుకు డేట్లిస్తారనుకున్నప్పటికీ తిరిగి ఆయన ఓజీకి డేట్లు ఇచ్చారు. దీనితర్వాత మరోసారి ఉస్తాద్ కు ఇవ్వబోతున్నారు. దీంతో దాదాపుగా ఈ సినిమా ఆగిపోయినట్లేనంటున్నారు. మరి నిర్మాత రత్నం ఏంచేస్తారో చూడాలి.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications