Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైఎస్ వివేకా హత్య వెనక అసలు నిజం ఇదే.. రేపే

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపిన హైప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం. ఈ హత్యకేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఈ హత్య వెనుక గల కారణాలు ఏమిటనే విషయంపై పలు కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి రెండో భార్య షమీమ్ కోణం కూడా తెరమీదికి వచ్చింది. ఆస్తి కోసమే వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ హత్యను చేయించారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సీబీఐ అధికారులు కూడా ఇటీవలే ఆయనను విచారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

YS VivekaNanda Reddy

ఈ పరిణామాల మధ్య ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. నిజం పేరుతో కొత్తగా యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ ఛానల్‌లో తొలి ఎపిసోడ్- వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం మీదే. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా? అనే టైటిల్‌తో ఈ ఎపిసోడ్ ప్రసారమౌతుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

వివేకా హత్య వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్లు ప్రబోధిస్తోన్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్లకు పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వి తీయడమే తన యూట్యూబ్ ఛానల్ నిజం ముఖ్య ఉద్దేశమని వివరించారు.

అబద్ధాల బట్టలూడదీయడానికే తాను ఈ ఛానల్‌ను ప్రారంభించానని ఆర్జీవీ చెప్పారు. అబద్ధాల బట్టలూడదీస్తేనే నిజం పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. అబద్ధం బతికేదే నిజాన్ని చంపే ప్రయత్నం కోసమేనని పేర్కొన్నారు. నిజాన్ని ఎవ్వరూ, ఎప్పటికీ చంపలేరని, అది సజీవంగా ఉందని చెప్పే ప్రయత్నాన్ని తాను ఈ ఛానల్ ద్వారా చేస్తానని అన్నారు.

Director Ram Gopal Varma launched a youtube channel named as Nijam

నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్‌ అని అభివర్ణించారాయన. అనాలిసిస్, టెక్నాలజీ, దాని చుట్టూ ఉన్న పరిణామాలు, అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సన్‌ట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు. తాను ఈ ప్రయత్నమే చేయబోతోన్నానని వివరించారు.

నిజం ఛానల్‌లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిీషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్, ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయని తెలిపారు. వాటి గురించి ప్రతి ఎపిసోడ్‌లో తాను మాత్రమే కాకుండా ఆయా రంగాలకు చెందిన నిపుణులు, థింకర్స్, రీసెర్చర్స్ ఆయా టాపిక్స్‌ను విశ్లేషిస్తారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+