ఎంత మాటనేశాడు... రోజా-బాలయ్య సెల్ఫీపై రాంగోపాల్ వర్మ ట్రోలింగ్..
Recommended Video
అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దుపై శాసనమండలిలో ఓవైపు చర్చ జరుగుతున్న వేళ.. వైసీపీ ఎమ్మెల్యే రోజా,టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు,రాజకీయాలపై తనదైన శైలిలో ట్రోలింగ్స్ చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. రోజా-బాలకృష్ణల సెల్ఫీని కూడా ట్విట్టర్‌లో ట్రోల్ చేశారు. అయితే రోజా అందంగా ఉందంటూ పొగిడిన ఆయన.. బాలకృష్ణను దిష్టిబొమ్మ అంటూ ట్రోల్ చేయడం గమనార్హం.
'సెల్ఫీలో రోజా గారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా ఉన్నాడు. ఈ ఫ్రేమ్‌లో అతను రోజా గారి అందాన్ని పాడుచేస్తున్నాడు.. లేదా అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు..' అంటూ వర్మ ట్రోల్ చేశారు. అంతేకాదు, ట్వీట్‌లో 'అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఈ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా..?' అంటూ మరో ట్వీట్ చేశారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లపై బాలయ్య అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

కాగా,సాధారణంగా బాలకృష్ణ విగ్గు లేనిదే బయటకు రారు. అలాంటిది విగ్గు లేకుండానే ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నెరిసిన గడ్డం,జుట్టుతో ఉన్న ఆయన ఫోటో వైరల్‌గా మారింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రోజా ఆయనతో దిగిన సెల్ఫీ కూడా వైరల్‌గా మారింది. వర్మ కన్ను దీనిపై పడటంతో బాలకృష్ణను ఇలా ట్రోల్ చేశాడు. గతంలో వేరే హీరోలను కూడా ఇలాగే ట్రోల్ చేసిన వర్మ.. ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానులు వర్మ ఫోటోలకు దండ వేసి.. RIP అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ట్రోల్ చేస్తూనే ఉండే వర్మ.. ఈసారి బాలయ్య బాబుపై పడటంతో.. ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.
Wowww Roja Garu looks like a HERO and some guy who I don’t know on her right looks like yuckk..He’s spoiling her beauty by spoiling the frame with his face ...Or maybe he is her Dishti Bomma pic.twitter.com/4uO19G6rZL
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications