జగన్ కు సోనియా వార్నింగ్, పవన్ శపథం : "వ్యూహం"లో స్కిల్ స్కాం..!!
సంచలన దర్శకుడు ఆర్జీవి వ్యూహం సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ లోనే తన సినిమాలో ఏం చెప్పబోతున్నారనేది స్పష్టత ఇచ్చేసారు. నాడు జగన్ ను సోనియా హెచ్చరించిన తీరును ట్రైలర్ లో చూపించారు. పవన్ కల్యాణ్ తాను సీఎం కాకున్నా పర్వాలేదు..జగన్ సీఎం కాకూడదనే శపథం వెనుక అంశాలను ప్రస్తావించారు. ఇక, తాజా సంచలనం స్కిల్ స్కాం ను ఆర్జీవీ తన వ్యూహం ట్రైలర్ లో చేర్చటం ద్వారా మరింత ఆసక్తి పెంచారు.
వ్యూహం ట్రైలర్ విడుదల : వైఎస్సార్ మరణం తరువాత జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా వ్యూహం సినిమాను దర్శకుడు ఆర్జీవి తెరకెక్కిస్తున్నారు. ఇందులో జగన్ - భారతి పాత్రల్లో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే వరుస టీజర్లతో ఆర్జీవీ ఆసక్తి పెంచారు. ఈ సినిమాను నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు తాజాగా ఆర్జీవి ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్జీవీ వ్యూహం సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. అందులో ఉద్వేగపూరిత సన్నివేశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తన తండ్రి వైఎస్సార్ మరణం తట్టుకోలేక మరణించిన వారి ఓదార్పు కోసం జగన్ సిద్దం అయిన వేళ సోనియా గాంధీ ఏ రకంగా వారించారు..ఏం చెప్పారనేది ఈ ట్రైలర్ లో చూపించారు.

చంద్రబాబు - పవన్ పాత్రల్లో : చంద్రబాబు, పవన్‌ల భేటీలు కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. మరోవైపు సోనియా, మన్మోహన్, రోశయ్యల పాత్రల్ని కూడా దింపేశారు. జగన్ ను నాడు సీబీఐ జేడీ విచారణ సన్నివేశాన్ని ఈ ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేసారు. తన స్టేట్మెంట్ ఇవ్వాల్సింది చెప్పాల్సింది విచారణ అధికారులకు కాదని..వారిని పంపించిన వారికి అంటూ జగన్ పాత్రలో ఉన్న వ్యక్తితో చెప్పించారు. అదే విధంగా చంద్రబాబు నాడు జగన్ కేసుల సమయంలో ఏ రకంగా వ్యవహరించారో సినిమాలో చూపించేందుకు ఆర్జీవీ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, పవన్ కల్యాణ్ తాను జగన్ ను సీఎం కాకూడదంటూ చేసిన శపథం చూపించేందుకు ట్రైలర్ లో ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు - పవన్ పొత్తు భవిష్యత్ లో ఏంటనేది గ్లాప్ కింద పడేయటం ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు.
స్కిల్ స్కాం ప్రస్తావతో : 40 ఏళ్ల ఇండస్ట్రీ అయి ఉండి..40 ఏళ్ల యువకుడిని చూసి వణుకుతున్నారేంటని చంద్రబాబును ప్రశ్నించటం చూపించారు. ఆ కల్యాణ్ కు ఎవరు శత్రువో..ఎవరు మిత్రుడో తెలుసుకోలేరంటూ మరో డైలాగ్ చూపించారు. ఇక, జగన్ తన ముందు పిల్లోడు అంటూ చంద్రబాబు చెప్పిన డైలాగ్స్ ట్రైలర్ చివరలో ఉంచారు. ఇక..ప్రస్తుతం చంద్రబాబు జైలుకు కారణమైన స్కిల్ స్కాం అంశాన్ని ట్రైలర్ లో ప్రస్తావించారు. స్కిల్ స్కాంలో దోచుకున్న సొమ్ము ఎవరి జేబులోకి వెళ్లిందనే ప్రశ్నను చూపించారు. దీని ద్వారా రాజకీయంగా ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేందుకు ఆర్జీవీ ఈ ట్రైలర్ ద్వారా ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications