ఏపీ అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లుపై చర్చ...ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్న టిడిపి మంత్రులు
Recommended Video

అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బీసీల్లో చేర్చి సీఎం చంద్రబాబు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఉదయం కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మంత్రి అచ్చెన్నాయుడు కాపు బిల్లుపై చర్చను ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీ హయాంలోనే కాపులు బీసీల్లో ఉన్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక బీసీల లిస్టు నుంచి కాపులను తొలగించిన విషయం మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఎవరూ అడగలేదని, పాదయాత్రలో కాపుల కష్టాలను చూసి చలించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని తనంతట తానుగా హామీ ఇవ్వడమే కాకుండా దాన్ని అమలు చేసి చూపించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ బీసీ కమిషన్ ద్వారా శాస్త్రీయంగా అధ్యయనం చేయించి కాపులకు రిజర్వేషన్లు కల్పించడం సంతోషదాయకంగా ఉందన్నారు.
అలాగే రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం పట్ల ఆయన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications