disha murder case:కంటికి కన్ను, పంటికి కన్ను, నిందితులను కఠినంగా శిక్షించాలి:కేఏ పాల్
దిశ హత్యపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. కంటికి కన్ను, పంటికి పన్ను అని బైబిల్ చెప్పిందని పాల్ హాట్ కామెంట్స్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అయితే లైంగికదాడుల గురించి కొందరు రాజకీయ నేతల ప్రసంగాలు సరికాదని పాల్ అభిప్రాయపడ్డారు.
దిశ హత్య కేసు నిందితులను కోర్టుల పేరుతో తిప్పకూడదని కేఏ పాల్ అన్నారు. వారికి తక్షణమే శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. లైంగికదాడులకు పాల్పడే నీచులకు ఎవరూ మద్దతివ్వకూడదని కోరారు. వారిని పశువులతో పోల్చి వాటిని తక్కువ చేయొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా చర్చానీయాంశమై నిర్భయ హత్య కేసు దోషులకు ఇంతవరకు ఉరి శిక్ష ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. సీరియస్ నెస్ ఉన్న కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయడంతో శిక్షలు త్వరగా విధించొచ్చని అభిప్రాయపడ్డారు. లైంగికదాడులపై కొందరు నేతల కామెంట్లను మాత్రం ఖండించారు. అయేషా మీరాను ఎవరు మట్టుబెట్టారు ఇంతవరకు తేల్చలేదని పాల్ గుర్తుచేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలే తప్ప.. తప్పించుకోకూడదని అభిప్రాయపడ్డారు.
దిశ లైంగికదాడి హత్య కేసును విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. దిశ హత్య కేసు విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. ప్రభుత్వ లేఖపై హైకోర్టు స్పందించింది. కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్టు బుధవారం స్పష్టంచేసింది. మహబూబ్ నగర్ మేజిస్ట్రేట్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications