వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి 'రోగాల'కు డికె కౌంటర్: సిఎం ఆపినా ఆగదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

DK Aruna
హైదరాబాద్/కరీంనగర్: రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలకు ఒక్కొక్కరకు ఒక్కో రోగం వచ్చిందన్న తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలకు మంత్రి డికె అరుణ కౌంటర్ ఇచ్చారు. టిడిపి నేతల వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆమె రోగాలున్నది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకే అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కరువు కాటకాలే అన్నారు.

రాష్ట్రం అభివృద్ధి లేక అధోగతి పాలయిందన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తెలుగు ప్రజలను ద్రోహం చేసింది చంద్రబాబే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి అడ్డుపడినా తెలంగాణ ఆగదన్నారు. విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని అధిష్టానంపై ఒత్తిడి చేసేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు.

రేణుకా చౌదరిపై పొన్నం

ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పాకనే ఉద్యమంలోకి రావాలని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కోరుతూ ఆత్మహత్యలకు పాల్పడిన వారి పట్ల ఆమె చులకనగా మాట్లాడారన్నారు. ఆమె తన మాటలను ఉపసంహరించుకోవాలన్నారు.

సోనియా వెనక్కి తగ్గరు: యాష్కీ

రాష్ట్ర విభజన అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ వేరుగా అన్నారు. నెలాఖరులోగా కేబినెట్ నోట్ సిద్ధమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయరన్నారు. జెఏసి సకల జన భేరీ సదస్సు అవసరం లేదని చెప్పారు.

English summary

 Minister DK Aruna on Tuesday condemned TDP leader Kodela Siva Prasad comments against Congress Party High Command leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X