వాట్సప్ గ్రూపులో పోర్న్ వీడియోలు పోస్ట్ చేసిన వైద్యుడు...బిత్తర పోయిన లేడీ డాక్టర్లు:కేసు నమోదు

విజయవాడ:వాట్సప్‌ గ్రూపులో అశ్లీల చిత్రాలు,వీడియోలు పోస్ట్‌ చేసిన ఒక డాక్టర్ పై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోర్న్ వీడియోలు పోస్ట్‌ చేసిన వ్యక్తి వైద్యాధికారి కావడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే...

పోలీసుల కథనం ప్రకారం...ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పేరుతో క్రియేట్ చేయబడిన 125 మంది సభ్యులతో కూడిన ఒక వాట్సప్‌ గ్రూపుకు శ్రీనివాసరాజు అనే వ్యక్తి అడ్మిన్‌గా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి బుధవారం ఈ గ్రూప్ లో వరుసగా అశ్లీల చిత్రాలు, వీడియోలు ప్రత్యక్షం కాసాగాయి. వీటిని గమనించిన గ్రూప్ లోని లేడీ డాక్టర్లు, ఇతర సభ్యులు ఆ విషయాన్ని వెంటనే గ్రూప్ అడ్మిన్ శ్రీనివాసరాజుకు తెలిపారు. ఆయన ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Doctor posted porn videos in the Watsapp group:Police case file

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ పోస్ట్‌ లు చేసిన వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రవికుమార్‌ అని, ఆయన ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారని గుర్తించారు. అతనిపై ఐటీ యాక్ట్‌ 67 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+