ఆపరేషన్ చేసి కుట్లేశారు; కడుపులో సర్జికల్ క్లాత్ మర్చిపోయారు: ఏపీలో షాకింగ్ ఘటన

ఏపీలో వైద్యుల నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. మహిళ కడుపులో సర్జికల్ క్లాత్ వదిలి కుట్లు వేసిన ఘటన 8 నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భసంచి తొలగించడం కోసం ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు చేసిన ఘనకార్యం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సదరు మహిళ తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం

ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు చేసిన నిర్వాకం ఒక మహిళ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. మైలవరం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు ఎనిమిది నెలల క్రితం 51 ఏళ్ల మచిలీపట్నానికి చెందిన శివ పార్వతి అనే మహిళకు గర్భసంచి తొలగింపు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆ సమయంలో వారు కడుపులో ఒక మీటర్ పొడవున్న సర్జికల్ క్లాత్ ను మరచిపోయి కుట్లు వేసేశారు. ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.

కడుపునొప్పితో ఆస్పతికి మహిళ.. కడుపులో సర్జికల్ క్లాత్

కడుపునొప్పితో ఆస్పతికి మహిళ.. కడుపులో సర్జికల్ క్లాత్

గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నుంచి సదరు మహిళలకు తరచూ కడుపునొప్పి రావడంతో ఆమె ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి అనేకమార్లు సీటీ స్కాన్ చేయించిన ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఆమెను విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ అల్ట్రా సోనోగ్రఫీ తర్వాత వైద్యులు ఆమె కడుపులో సర్జికల్ క్లాత్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన శివ పార్వతి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

మళ్ళీ ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు ... ఘటనపై విచారణ

మళ్ళీ ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు ... ఘటనపై విచారణ

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆమె కడుపులో మీటర్ పొడవుతో ఉన్న సర్జికల్ క్లాత్ ను ఆపరేషన్ చేసి వైద్యులు తొలగించారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆపరేషన్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం ఘటన పైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు బాధిత మహిళ తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+