చిన్నారిని కరిచిన కుక్క: వ్యాక్సిన్ రియాక్షన్ (ఫోటోలు)

హైదరాబాద్: ఓ శునకం అభం శుభం తెలియని చిన్నారిని కరిచింది. రెండున్నరేళ్ల చిన్నారి సుదర్శన్‌ను శుక్రవారం ఉదయం కుక్క కరిచింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క అతనిపై పడి కుడి చెవి నుంచి పెదాల వరకు చర్మం ఊడి వచ్చేలా కరిచింది.

బాబును చూసిన తల్లిదండ్రులు రమణ్ మిశ్రా, ప్రీతి మిశ్రా తల్లడిల్లిపోయారు. వెంటనే బాబును సమీపంలో గల హైదరాబాదులోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రైబిస్ వ్యాక్సిన్ టెస్టు డోస్ ఇచ్చారు. అయితే అది రియాక్షన్ ఇచ్చింది.

బాలుడికి హ్యూమన్ సీరమ్ వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇది ఆస్పత్రిలో అందుబాటులో లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు రూ. 2,500 ఖర్చు చేసి బయటి నుంచి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బాలుడిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Dog bites girl in Hyderabad

ఇదిలావుంటే, చిన్నారిపై దాడి చేసిన కుక్క స్థానికులు కొట్టి చంపారు. శుక్రవారంనాడు ఫీవర్ ఆస్పత్రిలో 28 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+