గణేశ నిమజ్జనంలో డీజే పాటలకు స్టెప్పులేసిన కుక్క.. వీడియో చూడండి!!

తొమ్మిది రోజుల పాటు ప్రజలచేత పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ చెంతకు చేరుకుంటూ తెలుగు రాష్ట్రాలలో గణేశ నిమజ్జనం కొనసాగుతుంది. వాడ వాడలా గణనాథులను నిమజ్జనోత్సవ కార్యక్రమం అత్యంత వైభోగంగా, సందడిగా కొనసాగుతుంది. ఇక గణేష్ నిమజ్జనానికి కుర్ర కారు ఫుల్ జోష్ తో చిందులేస్తుంది. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ పిల్లలు, పెద్దలు సందడి చేస్తూ వినాయకుడిని సాగనంపుతున్నారు.

గణపతి బప్పా మోరియా అంటూ చిందులు వేస్తూ వినాయకుడిని గంగమ్మ చెంతకు చేరుస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆసక్తికర దృశ్యాలు కూడా కంట పడుతున్నాయి. గణేష్ నిమజ్జనంతో పిల్లలతోపాటు డీజే పాటలకు స్టెప్పులేసింది ఒక శునకం. కుర్ర కారుతో కలిసి మాస్ బీట్ పాటలకు లయబద్ధంగా కుక్క సైతం స్టెప్పులు వేసింది. ఇక ఈ దృశ్యం అందరిని ఇట్టే ఆకట్టుకుంది.

Dog steps to DJ songs in Ganesha immersion.. Watch this interesting video!!

పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని సెగిడి వీధిలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకు వెళ్ళారు స్థానికులు. డీజే సౌండ్స్‌తో, యువత డాన్స్‌లతో ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో పాత బస్టాండ్ వద్దకు ఊరేగింపు వచ్చేసరికి ఓ వీధి కుక్క ఊరేగింపు లోకి చేరింది. డాన్స్ చేస్తున్న యువతను చూసి అది కూడా యువతతో కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టింది.

డిజె సాంగ్స్ కి తగ్గట్టు లయబద్ధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కుక్క డాన్స్ చూసి షాక్ అయిన స్థానికులు, ఆపై దాని మెడలో దండ వేసి దానితో కలిసి వారంతా స్టెప్పులేశారు. ఇక కుక్క గణేశ నిమజ్జనానికి డాన్స్ చేయడాన్ని ఫోన్లలో బంధించారు.

గణేశ నిమజ్జనం సందర్భంగా కుక్క డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఎటువంటి శిక్షణ లేని ఓ వీధి కుక్క గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేయడం అది చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గణపతి నిమజ్జనంలో కుక్క కూడా తన్మయత్వంతో చిందులేసింది అని అంతా చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+