పవన్ అర్థం కావట్లేదు, చిరును అంటే: డొక్కా హెచ్చరిక

చిరంజీవిని జై సమైక్యాంధ్ర నేత సబ్బం హరి విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చిరంజీవిని ఏమైనా అంటే సూర్యుడి పైన ఉమ్మేసినట్లే అన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడే చిరు పైన సబ్బం వ్యాఖ్యలు సరికాదన్నారు. తప్పుగా మాట్లాడితే కళ్లు పోతాయని హెచ్చరించారు.
పవన్ గురించి మాట్లాడటం అనవసరమన్నారు. ఆయన ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నుండి బయటకు వెళ్లింది నాయకులే తప్ప కార్యకర్తలు కాదన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి.. డబ్బులు సంపాదిస్తూ చివరి వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారన్నారు.
తమ పార్టీ నేతలు చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణలు ముఖ్యమంత్రి అవుతారేమోననే ఆందోళనతో సమైక్య ముసుగులో కిరణ్ నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు.
పవన్‌కు రుద్రరాజు ప్రశ్న
పవన్ కళ్యాణ్ సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయవద్దా అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రుద్రరాజు పద్మరాజు ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీని కూకటివేళ్లతో పెకిలించడం ఎవరి వల్ల కాదన్నారు. దొంగలను టిడిపి ఎందుకు తమ పార్టీలో చేర్చుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications