• search

'పద్మలతతో డీఎస్పీ రవిబాబుకు వివాహేతర సంబంధం, స్థలం అమ్మి ఇచ్చినా తగ్గలేదు'

By Srinivas G
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  విశాఖపట్నం: రౌడీషీటర్ గేదెల రాజు హత్య కేసులో డీఎస్పీ రవిబాబు తన తప్పును అంగీకరించారు. ఈ విషయాన్ని పోలీసులు శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.

  'పద్మలత' వల్లే రాజును డీఎస్పీ హత్య చేయించాడు: 'బ్యాంకాక్‌లోనే స్కెచ్!'

  గేదెల రాజు హత్యతో పాటు పద్మలతను కూడా రవిబాబు హత్య చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. పద్మలతకు విషం ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. గేదెల రాజు హత్య కేసు విచారణ సందర్భంగా పద్మలతది సాధారణ మరణం కాదని తేలిందన్నారు.

  మాజీ ఎమ్మెల్యే కూతురుతో సంబంధం, హత్యకు రూ.కోటి, రౌడీషీటర్ హత్య: ఈ డీఎస్పీ మామూలోడు కాదు

  వివరాలు వెల్లడించిన పోలీసులు

  వివరాలు వెల్లడించిన పోలీసులు

  గేదెల రాజును హత్య చేయించడానికి భూపతిరాజు శ్రీనివాసరాజుతో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం వాస్తవమేనని డీఎస్పీ రవిబాబు నేరం అంగీకరించినట్లు విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ 2 రవి కుమార్ మూర్తి వెల్లడించారు.

  పద్మలత తండ్రి ఫిర్యాదుతో హత్య కేసుగా

  పద్మలత తండ్రి ఫిర్యాదుతో హత్య కేసుగా

  మరోవైపు, తన కూతురిది హత్య అని పద్మలత తండ్రి కాకర నూకరాజు పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శనివారం రాత్రి గాజువాక పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. ఇందులో కూడా ఎ1గా రవిబాబు ఉన్నారు. ఎ2గా భూపతిరాజు శ్రీనివాసరాజు, ఎ3గా గేదెల రాజు ఉన్నట్లు తేల్చారు.

  పద్మలతతో పరిచయం, వివాహేతర సంబంధం

  పద్మలతతో పరిచయం, వివాహేతర సంబంధం

  రవిబాబు 2000 నుంచి 2003 వరకు యలమంచిలి సీఐగా పని చేశారని, ఆ సమయంలో పద్మలతతో ఏర్పడిన పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసిందని, పెళ్లికి రవిబాబు ముఖం చాటేయడంతో 2016 మార్చిలో ఆమె డీజీపీకి, విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారని తెలిపారు.

  పద్మలతతో సెటిల్, ఓ స్థలం అమ్మి ఇచ్చినా తగ్గలేదు

  పద్మలతతో సెటిల్, ఓ స్థలం అమ్మి ఇచ్చినా తగ్గలేదు

  ఈ నేపథ్యంలో డీఎస్పీ రవిబాబు గాజువాకకు చెందిన రౌడీ షీటర్‌ గేదెల రాజు, క్షత్రియభేరి పత్రిక ఎడిటర్‌, ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజులను రంగంలోకి దింపి పద్మలతతో సెటిల్‌ చేసుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఓ స్థలాన్ని అమ్మేసి చేసి కొంత మొత్తాన్ని ఆమెకు ఇచ్చారని, అయినా ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తూ వచ్చారని, దీంతో ఆమెను చంపేందుకు నిర్ణయించిన రవిబాబు రూ.కోటికి గేదెల రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు.

  పద్మలత కుటుంబంతో పరిచయం చేసుకొని

  పద్మలత కుటుంబంతో పరిచయం చేసుకొని

  తొలుత భూపతిరాజు శ్రీనివాసరాజు ద్వారా రూ. 50 లక్షలు ఇప్పించారు. ఆమెను చంపేందుకు గేదెల రాజు ప్రణాళిక రచించాడు. ముందుగా మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పరచుకుని వారికి సన్నిహితుడిలా నటించాడు. ఆ తర్వాత రవిబాబుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి పద్మలతను తన ఇంటికి ఆహ్వానించాడు.

  విషప్రయోగం జరిగిన విషయం గుర్తించని పద్మలత, ఫ్యామిలీ

  విషప్రయోగం జరిగిన విషయం గుర్తించని పద్మలత, ఫ్యామిలీ

  గత ఏడాది ఆగస్టు 29న గాజువాకలోని ఆల్ఫా హోటల్‌ నుంచి బిర్యానీ తెప్పించి అందులో విషం కలిపి ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఆమె వాంతులు చేసుకుంటుండడంతో కేజీహెచ్‌లో చేర్పించాడు. పద్మలత కుటుంబం వచ్చి డాక్టర్లతో మాట్లాడి మంచి వైద్యం చేయించడంతో ఆమె కోలుకున్నారు. ఆమెపై విషప్రయోగం జరిగిందన్న విషయాన్ని ఆమె గానీ, ఆమె కుటుంబసభ్యులు గానీ గుర్తించలేకపోయారు.

  విషం ఇచ్చిన అలా నమ్మించాడు

  విషం ఇచ్చిన అలా నమ్మించాడు


  గేదెల రాజు మళ్లీ పద్మలతపై ఒత్తిడి చేసి పూర్తిగా కోలుకునేవరకు తన ఇంట్లోనే ఉండాలని చెప్పి ఆమెను ఒప్పించాడు. ఆమెను చంపేందుకు స్లో పాయిజన్ ఇచ్చాడు. ఆమె ఆరోగ్యం క్రమంగా కృశించి పూర్తిగా మంచాన పడింది. పద్మలత తండ్రితో మాట్లాడి ఆమె ఆరోగ్యం బాగుపడడానికి రేకపల్లిలో ఒక మంత్రగాడున్నాడని అతనితో తాయత్తు కట్టిస్తే ఫలితం ఉంటుందని చెప్పి అక్కడకు తీసుకెళ్దామని గేదెల రాజు చెప్పాడు. నూకరాజు తన కుమారుడు మురళి, తన మిత్రుడు కృష్ణలను కూడా వారితో పంపాడు. వారిద్దరూ వేరే వాహనంలో కొంతదూరంలో ఉండేలా చేసిన గేదెల రాజు తన కారులోనే పద్మలతకు విషం ఇచ్చాడు. దాంతో ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని ఆమె తండ్రి ఇంటికి తీసుకెళ్లి గుండెపోటుతో చనిపోయిందని నమ్మించాడు.

  ప్లాన్ ప్రకారం హత్య

  ప్లాన్ ప్రకారం హత్య

  పద్మలత మృతి అనంతరం రవిబాబు మరో రూ.50 లక్షలు ఇవ్వకుండా ముఖం చాటేశాడు. వాయిస్ రికార్డ్ ఆధారాలున్నాయని బెదిరించాడు. అనంతరం రవిబాబు - గేదెల రాజుకు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అతనిని కూడా రవిబాబు హత్య చేయించాడు. ఇందుకు భూపతిరాజుతో రూ.10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

  English summary
  Dasari Ravi Babu, Dy. SP and prime accused in the murder of rowdy-sheeter K. Satyanarayana Raju alias Gedela Raju, has confessed to his crime and said he had paid ₹10 lakh to Bhupathiraju Srinivasa Raju (A2), to avoid harassment for money, according to the police.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more