ఏపీ, తెలంగాణకు కీలకమైన వరంగల్‌కు స్టాప్ ఎత్తేసిన దక్షిణ మధ్య రైల్వే
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల పరిధిలోని డివిజన్లలో సిగ్నలింగ్ ను ఆధునికీకరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హసన్ పర్తి - కాజీపేట ఎఫ్ క్యాబిన్ - వరంగల్ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు 18 రైళ్లకు వరంగల్ లో హాల్టింగ్ ను తొలగించారు. వాటి వివరాలు
సెప్టెంబరు 25 నుంచి 28 వరకు
విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్ రథ్ 12739 (కాజీపేటలో హాల్ట్)
సెప్టెంబరు 26 నుంచి 29 వరకు
సికింద్రాబాద్-విశాఖపట్నం గరీబ్ రథ్12740 (కాజీపేటలో హాల్ట్)

సెప్టెంబరు 25వ తేదీన.. షాలిమార్-సికింద్రాబాద్ ఏసీ సూపర్ ఫాస్ట్ 12773 (కాజీపేటలో హాల్టింగ్)
సెప్టెంబరు 26వ తేదీన టాటా-యశ్వంత్ పూర్ 18111 (కాజీపేటలో హాల్టింగ్)
సెప్టెంబరు 27 నుంచి 28 వరకు
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ 20707 (కాజీపేటలో హాల్టింగ్)
సెప్టెంబరు 27 నుంచి 29వ తేదీ వరకు
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ 20708 (కాజీపేటలో హాల్టింగ్)
సెప్టెంబరు 26 నుంచి 28వ తేదీ వరకు
సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ 20834 (కాజీపేటలో హాల్టింగ్)
సెప్టెంబరు 26 నుంచి 28వ తేదీ వరకు
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ 20833 (కాజీపేటలో హాల్టింగ్)
సెప్టెంబరు 25 నుంచి 28వ తేదీ వరకు
విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్ ప్రెస్
సెప్టెంబరు 26 నుంచి 29వ తేదీ వరకు
హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్ ప్రెస్
సెప్టెంబరు 25 నుంచి 28వ తేదీ వరకు
విశాఖపట్నం - మహబూబ్ నగర్ 12861
సెప్టెంబరు 26 నుంచి 29వ తేదీ వరకు
మహబూబ్ నగర్-విశాఖపట్నం 12862
సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు
షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ 18045
సెప్టెంబరు 26 నుంచి 28వ తేదీ వరకు
హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ 18046
సెప్టెంబరు 26న విశాఖపట్నం-సాయినగర్ షిరిడీ 18503
సెప్టెంబరు 27న సాయినగర్ షిరిడీ-విశాఖపట్నం 18504
సెప్టెంబరు 25న షాలిమార్-సికింద్రాబాద్ వీక్లీ 22849
సెప్టెంబరు 27న సికింద్రాబాద్-షాలిమార్ వీక్ల 22850
ఈ తేదీలకు అనగుణంగా ప్రయాణికులు తమ ప్రయాణాల షెడ్యూల్ లో మార్పులు చేసుకోవాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications