దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం ఎప్పుడో తేల్చిన మంత్రి వెల్లంపల్లి: కేశినేని నాని, గద్దె దద్దమ్మలుగా
విజయవాడ: విజయవాడలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. 95 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చేనెల ఆగస్టు 15వ తేదీ నాటికి మిగిలిన పనులను పూర్తి చేస్తామని అన్నారు. అదే నెల 30వ తేదీన ఫ్లైఓవర్‌ను వాహనదారుల కోసం అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేశారు.
దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అప్పుడెప్పుడో చంద్రబాబు హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన పడిందని, తన హయాంలో చంద్రబాబు దీన్ని పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఫ్లైఓవర్‌ను కృష్ణా పుష్కరాల నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన చంద్రబాబు.. సకాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు.

రాష్ట్రపతి వద్దకు వెళ్లి తమ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన స్థానిక ఎంపీ కేశినేని నానికి.. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో చోటు చేసుకున్న జాప్యం కనిపించలేదా? అని నిలదీశారు. సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా నిధులను మంజూరు చేయకపోవడమే కారణమని విమర్శించారు. సకాలంలో నిధులు మంజూరు చేయకుండా అయిదేళ్లు కాలక్షేపం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయని చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇచ్చామని, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేశామని అన్నారు. దీనికి అదనంగా బెంజ్ సర్కిల్‌లోనూ ఫ్లైఓవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కనీసం దుర్గుగడి ప్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయలేని చంద్రబాబు అమరావతిని నిర్మిస్తారంటే ఎలా విశ్వసిస్తామని అన్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఇబ్బందులను తీర్చలేని కేశినేని నాని, గద్దె రామ్మోహన్ వంటి టీడీపీ నాయకులు ఇంట్లో తాగి పడుకున్న దధ్దమ్మలని ధ్వజమెత్తారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications