Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dussehra 2024: దసరా ఏ రోజు, పూజా ముహూర్తం, ఈ సారి ప్రత్యేకత..!!

దసరా ఉత్సవాలకు సమయం సమీపిస్తోంది.దేశ వ్యాప్తంగా ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజును అసత్యంపై సత్యం, పాపంపై పుణ్యం సాధించిన విజయంగా జరుపుకుంటారు. నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి దసరా ఎప్పుడు...పూజా ముహూర్తం.. ప్రత్యేకతల పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు.

పండుగ ఏ రోజు
విజయదశమికి ప్రతీ సారి ప్రత్యేక ఉంటుంది. శ్రీరాముడు రావణుడిని సంహరించి చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశాన్ని ఇచ్చాడు. విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడిని ఓడించింది. ఈ విజయదశమి రోజున శమీ, అపరాజితలను పూజిస్తారు. పండుగ దశమి తిథి అక్టోబర్ 12, 2024 ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13, 2024 ఉదయం 09:08 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 12న దసరా జరుపుకోనున్నారు.

Dussehra 2024 Date Puja Muhuratam and Significance details here

అక్కడ మాత్రం ఇలా
శాస్త్రాల ప్రకారం విజయదశమి లేదా దసరా నాడు శ్రావణ నక్షత్రం ఉండటం చాలా శుభప్రదమైనది. 2024 సంవత్సరంలో శ్రవణ నక్షత్రం అక్టోబర్ 12 ఉదయం 5:25 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13 తెల్లవారుజామున 4:27 గంటలకు ముగుస్తుంది. విజయదశమి రోజున పూజ సమయం మధ్యాహ్నం 2:02 నుంచి 2:48 వరకు ఉంటుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు 46 నిమిషాలు ఉంటుంది. బెంగాల్‌లో దసరా పండుగను ఈ సంవత్సరం అక్టోబర్ 13, 2024న అంటే ఆదివారం జరుపుకుంటారు.

దశమి ప్రత్యేకత
ఈ రోజున పూజ శుభ సమయం మధ్యాహ్నం 1:16 నుంచి 3:35 వరకు కొనసాగుతుంది. ఆరాధన మొత్తం వ్యవధి సుమారు 2 గంటల 19 నిమిషాలు. విజయదశమి పండుగను శక్తి, ధైర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. రావణుడితో చేసిన యుద్ధంలో రాముడి బలం, ధైర్యం ప్రదర్శించబడ్డాయి. దసరా పాప వినాశనానికి ప్రతీక. దసరా రోజున కొన్ని చోట్ల దుర్గామాత విగ్రహం, కలశం (దుర్గా పూజ శుభ ముహూర్తం) నిమజ్జనం చేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+