పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళపై దువ్వాడ శ్రీనివాస్ లేటెస్ట్ కామెంట్స్!!
దువ్వాడ కుటుంబ కథా చిత్రం రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతూ సాగుతుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ తనను తన భార్య,పిల్లలు సరిగ్గా చూడలేదని, ఇంట్లోకి రానివ్వలేదని, దిక్కుతోచని స్థితిలో మరొక స్త్రీకి దగ్గరైన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. దివ్వెల మాధురి కూడా భర్త తో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకుందని, ఈ సమయంలో తాను అండగా ఉంటానని చెప్పానని ఈ క్రమంలోనే ఆమెకు అండగా ఉంటున్నట్టుగా తెలిపారు.
పవన్ పెళ్ళిళ్ళపై చేసిన కామెంట్స్ దువ్వాడ సమాధానం
ఇదే సమయంలో ఇష్టం ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు కలిసి సహజీవనం చేయడం లీగల్ అని సుప్రీంకోర్టు నే చెప్పిందని, తాము చేసింది తప్పు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపైన ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు ఆసక్తికర సమాధానం చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. రాజకీయాలలో భాగంగా ఎన్నో మాట్లాడతామని ఏవో కామెంట్స్ చేస్తామని అవన్నీ నిజాలు కాదంటూ వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఇబ్బందులు ఏమిటో ఆయనకే తెలుసు
రాజకీయాలలో నిజాలకు, నిజాయితీకి తావు లేదని దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెప్పారు. గతంలో తన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి తెలియక తప్పుగా మాట్లాడానని, ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏమిటో ఆయనకే తెలుసని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నా ఇబ్బంది నేపథ్యంలోనే నేను అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు.
పవన్ పెళ్ళిళ్ళ విషయంలో స్వరం మార్చిన దువ్వాడ
గతంలో పవన్ కళ్యాణ్ పైన దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని, హిందూ ధర్మంలో ఏకపత్నీ వ్రతం మాత్రమే ఉందని, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మానికి గౌరవం ఇవ్వని వ్యక్తని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెనక పాపం ఆయనకు ఎటువంటి సమస్యలు వచ్చాయో అని అంటూ స్వరం మార్చారు.
దువ్వాడకు పవన్ అభిమానుల సెటైర్లు
అలాగే ఎన్టీఆర్ మళ్లీ పెళ్లి చేసుకోవడం వెనుక కూడా ఆయనకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అని ఇప్పుడు తాను గుర్తించినట్టుగా దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో తాజాగా దువ్వాడ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన దాకా వస్తేనే కానీ ఎవరికైనా తెలీదని జనసేన నేతలు తాజా వ్యాఖ్యలతో చెప్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని రచ్చ చేసుకోలేదని, హుందాగా పెళ్లి చేసుకున్నారని దువ్వాడకు సెటైర్లు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications