దివ్వెల మాధురిది ఆత్మహత్యాయత్నం కాదా ? బయటపడ్డ దువ్వాడ శీనుతో ఆడియో కాల్..!
శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూ, ఆయన భార్య దువ్వాడ వాణికీ మధ్య నెలకొన్న వివాదం పలు మలుపులు తిరిగి చివరకు ఆయన ప్రేయసి దివ్వెల మాధురి వద్దకు వచ్చి ఆగింది. దీంతో ఈ వివాదం కాస్తా దివ్వెల మాధురి వర్సెస్ దువ్వాడ వాణిగా కూడా మారిపోయింది. అయితే ఈ క్రమంలో వాణి మాటలు భరించలేక కారు ప్రమాదానికి మాధురి ప్రయత్నించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే అది నిజం కాదని తాజాగా బయటపడ్డ ఓ ఆడియో కాల్ చెబుతోంది.
దువ్వాడ శ్రీనివాస్ కూ, వాణికీ మధ్య నెలకొన్న వివాదం మధ్యలోకి వచ్చిన దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. మాధురి నడుపుతున్న కారు ప్రమాదానికి గురయింది. ఇందులో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కోలుకుని ఆ తర్వాత ఆమె బయటపడ్డారు. కానీ వాణి మాటలు భరించలేక ఆమె కారుతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే అది నిజం కాదని తాజాగా బయటపడిన ఓ ఆడియో కాల్ లో తేలింది. ఆ సమయంలో దువ్వాడ శ్రీనుకూ, మాధురీకి మధ్య నడిచిన సంబాషణ ఈ ఆడియో కాల్ లో ఉంది.

మనస్తాపంతో మాధురి రోడ్డు ప్రమాదం చేయడంతో దీన్ని ఆత్మహత్యగా మార్చి సానుభూతి పొందేందుకు ఆమె ప్రయత్నించినట్లు దువ్వాడ శ్రీనివాస్ తో ఆమె మాట్లాడిన ఆడియో కాల్ ద్వారా నిర్ధారణ అవుతోంది. వీరిద్దరూ కలిసి ముందుగానే ప్లాన్ చేసి ఈ యాక్సిడెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ ప్రమాదానికి దువ్వాడ వాణే కారణమని చెప్పాలని కూడా వీరు ముందుగానే అనుకున్నారు. తన ఆత్మహత్యాయత్నానికి దువ్వాడ వాణినే కారణమని చెప్పాలంటూ శ్రీనివాస్ ఆమెకు సలహా ఇచ్చారు. దీన్ని అలాగే పాటించిన మాధురి అప్పట్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు, దానికి వాణే కారణమని చెప్పేశారు.












Click it and Unblock the Notifications