అల్లు అర్జున్ ను ఒంటరి చేసారు, రేవంత్ చేసిందదే - పవన్ సంచలనం..!!

అల్లు అర్జున్ వివాదం పై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ ఇష్యూలో బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్ళి చెప్పి మాట్లాడి మేం తోడున్నాం అని చెపితే ఇంత జరిగేది కాదని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేసారని పవన్ చెప్పుకొచ్చారు. రేవంత్ విధానం ఏంటో ఈ అంశంలో స్పష్టమైందన్నారు.

హీరో మీద వేసేసారు
పుష్ఫ -2 తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ స్పందించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తూనే.. జరిగిన పొరపాట్లను పవన్ ప్రస్తావించారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేసారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి విధానం కనిపించింది అల్లు అర్జున్ అరెస్టులో అంటూ పవన్ పేర్కొన్నారు. ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అని వెల్లడించారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేసారు. టకెట్ రేట్లు పెంచడా నికి, షో లకి కూడా అనుమతులిచ్చారని చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాట్లు అంత హిరో మీద వేశారని వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ అభిప్రాయపడ్డారు.

Dy CM Pawan Kalyan Made interesting comments over Allu Arjun Episode and CM Revanth Reddy Reaction

అలా చేసి ఉంటే
ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని, అభివాదం చేయాలి అనే ఆలోచన ప్రతీ హీరోకి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్ళి చెప్పి మాట్లాడి మేం తోడున్నాం అని చెపితే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయ పడ్డారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. సమాజం పై ప్రభావం చూపించే లా ఎందుకు సినిమా ఉండకూడదు అనిపిస్తుందని.. సినిమాకు సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా, మర్యాద పూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని చెప్పుకొచ్చారు.

హీరో అదే కోరుకుంటాడు
ప్రతీ హీరో చేసిన సినిమాకు స్తుతి కోరుకుంటాడని పవన్ చెప్పారు. హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడని వివరించారు. అల్లు అర్జున్ అంశంలో మరింతగా ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ, సినిమా హాలు వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమని పవన్ వ్యాఖ్యానిం చారు. ఈ విషయంలో సీఎం గా రేవంత్ రెడ్డి ఏం చేసిన రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన పరిస్ధితి మారిపోయిందన్నారు. జూబ్లీ హిల్స్ ఏరియాలో మా వాళ్ళందరూ తిరుగుతుంటే వాళ్ళకి ఒక సూపర్ సీనియర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+