పవన్ 'సేఫ్' గేమ్, పక్కా ప్లాన్ - టీడీపీకి సంకటం..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వంలో కొంత కాలంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయాలు టీడీపీలో టెన్షన్ పెంచుతున్నాయి. పవన్ నాడు హోం మంత్రి అనిత ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నుంచి తిరుపతి ఘటన వరకు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఒక విధంగా ఆత్మరక్షణలో పడింది. పవన్ ఆగ్రహంతో అధికారుల పై చర్యలు తప్పటం లేదు. పవన్ చెబితే చంద్రబాబు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో మొదలైంది. అయితే, పవన్ ప్రభుత్వంలో ఉంటూనే తన భవిష్యత్ కోసం పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

పవన్ నిర్ణయాలతో
పవన్ కల్యాణ్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాలనా లోపాలను నాలుగు గోడల మధ్య కాకుండా ఓపెన్ గా ప్రస్తావిస్తున్నారు. తన అభిప్రాయాలు.. డిమాండ్లను బహిరంగంగానే వెల్లడిస్తు న్నారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో పవన్ పిఠాపురం కేంద్రంగా చేసిన వ్యాఖ్యల తో కలకం మొదలైంది. దీంతో, కడప జిల్లా ఎస్పీ పైన బదిలీ వేటు పడింది. ఆ వెంటనే సోషల్ మీడి యాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేసారు. ఆ తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. తాజా తిరుపతి ఘటనలోనూ పవన్ వైఖరి టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు.

DY CM Pawan Kalyan safe game in Govt with strategic decisions leads to new trouble for TDP

ఓపెన్ కామెంట్స్
తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సమయంలోనే పవన్ పరామర్శకు వచ్చారు. అటు చంద్రబాబు ఘటనకు బాధ్యులుగా కొందరి పైన చర్యలు తీసుకున్నారు. పవన్ బోర్డు ఈ ఘటన పైన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటంతో పాటుగా కీలక అధికారుల మధ్య సమన్వ యం లేదని చెప్పుకొచ్చారు. పోలీసు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తొలుత అందుకు అంగీకరించని విధంగా వ్యాఖ్యలు చేసిన ఛైర్మన్ ఆ తరువాత క్షమాపణ చెప్పారు. ఈ సమయం లో పవన్ తన భవిష్యత్ కోసం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. పాలనా వ్యవహారాల్లో లోపాల్లో తన పైన మచ్చ లేకుండా పవన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

పవన్ పక్కా వ్యూహం
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూనే పవన్ లోపాలను ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా తాను ప్రభుత్వాన్ని అలర్ట్ చేయటంలో ముందున్నాననే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో పాటుగా తానే ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలో డిమాండ్ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా చేయాలనేది పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. కానీ, ఇదే ఇప్పుడు సీఎంగా సమస్యగా మారుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంలో సమస్యల గురించి ముఖ్యమంత్రితో సమావేశమై చర్చ చేయకుండా.. బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, పవన్ మాత్రం రాజకీయంగా పక్కా వ్యూహాత్మకం గానే అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+