రేవంత్ కాబట్టే బన్నీ అరెస్ట్, పొరపాట్లు హీరో మీద వేసారు - పవన్..!!

డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పుష్ఫ -2 ప్రీమియర్ షో తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ పైన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరించి తీరును ప్రశంసించారు. సినీ ఇండస్ట్రీకి రేవంత్ మద్దతుగా నిలిచారని అభినందించారు. ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసి.. పొరపాట్లు హీరో మీద వేసేసారని వ్యాఖ్యానించారు. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. తన జిల్లాల పర్యటనల గురించి పవన్ కీలక అంశాలను వెల్లడించారు.

రేవంత్ పేరు చెప్పలేదనే
అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన పవన్ కల్యాణ్ అనూహ్య వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ ను ఒంటరి చేసారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కాబట్టే హీరో నీ అరెస్టు చేయగలిగారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో రేవంత్ పరిపాలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారుని అభినందించారు. పుష్ప బెనిఫిట్ షో కి టికెట్ ధరలు పెంచడం కూడా సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే కదా అంటూ పవన్ వ్యాఖ్యానించారు.రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అరెస్ట్ చేసారనడం సరైంది కాదని పేర్కొన్నారు. రేవంత్ ఎప్పుడో ఆస్థాయి దాటిపోయారని పవన్ పేర్కొన్నారు.

DY CM Pawan Kalyan supports Revanth decision over cine industry Reveals his district tours plan

ఇక జిల్లాల పర్యటనలు
పవన్ కల్యాణ్ పాలనా పరంగా మరో కీలక నిర్ణయం వెల్లడించారు. నెలలో 14 రోజులు జిల్లాల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు సీరియస్ గా పని చేస్తే 8 గంటలు చాలని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు అనుభంతో పాలనలో అనేక విషయాలు నేర్చుకున్నానన్నారు. ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకాలంటే వారితోనే మమేకం కావాలని అభిప్రాయపడ్డారు. ఒక సమస్య పరిష్కరించే లోగా వంద సమస్యలు వస్తున్నాయన్నారు. సమస్యలు పరిశీలించి పరిష్కారాలు చూపాలని చూస్తున్నట్లు వెల్లడించారు. పంచాయితీ ద్వారా ఎక్కువ డెవలప్ మెంట్ చేయచ్చని..
క్షేత్ర స్థాయిలోనే సమస్యలు ఎక్కువగా తెలుస్తాయని పేర్కొన్నారు.

మార్పు రావాలి
ఏజెన్సీ ప్రాంతంలో తిరిగినపుడు తన పేషీ తో సహా వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవటం అవసరమని అనిపించిందని పవన్ చెప్పారు. ప్రజా సమస్యల అంశంలో అధికారులను మరింత బాధ్యులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమయ పాలన అసలు లేకుండా పోయిందని వ్యాఖ్యానిం చారు. ఏపీ బ్యూరోక్రసీ గత ఐదేళ్ళలో అట్టడుగు స్ధాయికి పోయిందని చెప్పారు. శని ఆది వారాలు విశ్రాంతి తీసుకోవాలంటే వారం మొత్తం బాగా పని చేయాలన్నారు. మెరిట్ ఆధారంగా ప్రొమోషన్లు, ట్రాన్సఫర్ లు జరగాలని సూచించారు. వైసీపీ పాలన కంటే మా ఆరు నెలల పాలన చాలా బెటర్ గా ఉందని.. ఐదేళ్ళలో పని చేసే సంస్కృతిని చంపేసారని పవన్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+